ఆటాపోటీ

స్టెయిన్ భయపడ్డాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడైన డేల్ స్టెయిన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను భయపెడతాడు. కానీ, అతనే భయపడిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. స్టెయిన్ భయపడింది ఒక బౌలర్‌ని లేదా బ్యాట్స్‌మన్‌ను చూసికాదు.. అత్యంత ప్రమాదకరమైన పామును చూసి. తన స్నేహితుడితో కలిసి వాహనంలో వెళుతున్నప్పుడు రోడ్డుపై పడివున్న ఒక పామును చూసిన స్టెయిన్ దానిని కాపాడేందుకు కిందకు దిగాడు. ఎవరికీ హాని చేయని బ్రౌన్ హౌస్ పాము గుర్తుతెలియని వాహనం కింద పడి గాయపడిందని అనుకున్నాడు. కానీ, దగ్గరికి వెళ్లేసరికి అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన బ్లాక్ మంబా సర్పమని గుర్తించి ఉలిక్కిపడ్డాడు. దానిని సమీపించి ఉంటే, ఆ కాటుకు బలైపోయేవాడినని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో స్టెయిన్ వ్యాఖ్యానించాడు. తాను సాహసవంతుడినని నిరూపించుకోవడానికి ఈ వీడియో పెట్టడం లేదని, ఒక పని చేసే ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

ఫిఫాలో కొత్త ఆశలు!

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెలాఖరులో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉండడంతో, అవినీతి, అక్రమాల మరకలను చెరిపేసుకొని, సరికొత్త రూపంలో కనిపించేందుకు ఫిఫా కసరత్తు చేస్తున్నది. ఇటీవలే ఇద్దరు అధికారుల అరెస్టుతో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. అవినీతి, లంచగొండితనం, ముడుపులు స్వీకరించడం, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలపై స్విట్జర్లాండ్ నిఘా విభాగం అధికారులు ఇద్దరు ఫిఫా ఉపాధ్యక్షులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు పరాగ్వేకు చెందిన జువాన్ ఏంజెలో నపౌట్ (పరాగ్వే)కాగా, మరొకరు అల్ఫ్రెడో హవిట్ (హొండూరస్). గత ఏడాది మే మాసంలో అమెరికా నిఘా విభాగం సూచనలపై జ్యూరిచ్ పోలీస్‌లు 11 మంది ఫిఫా అధికారులను అరెస్టు చేసిన నాటి నుంచి తాజా సంఘటన వరకూ ఫిఫాలో ముడుపులు, అవినీతి కేసు ఎన్నో కీలక మలుపులు తిరిగింది. మనీలాండరింగ్ తదితర అభియోగాలపై తాజా అరెస్టులు జరిగాయి. ఈ కేసు భిన్న కోణాలను కలిగి ఉందని ఈ ఉదంతం చెప్తున్నది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే, ఫిఫా అధ్యక్షుడిగా ఆరోసారి ఎన్నికైనప్పటికీ, సెప్ బ్లాటన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బ్లాటర్‌తోపాటు, యూఫా అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ తదితరులను కూడా ఫిఫా సస్పెండ్ చేసింది. ఎనిమిదేసి సంవత్సరాలు సస్పెన్షన్‌కు గురైన బ్లాటర్, ప్లాటినీ మళ్లీ ఫిఫాలో కీలక పాత్ర పోషించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవినీతిపరులను ఒక్కొక్కరిగా చేసి ఏరివేతను కొనసాగించడంతో, కొత్త ఏడాది, సరికొత్త కార్యవర్గంతో మళ్లీ పూర్వవైభవాన్ని సంపాదించుకునే అవకాశం ఫిఫాకు ఉంది.

- శ్రీహరి