ఆటాపోటీ

జిడ్డు బ్యాటింగ్ -- పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను కళాత్మక ఆటకు ప్రతీకగా పేర్కొంటారు. అయితే, వనే్డల్లో అతని ఆట ఏమాత్రం సరిపోదన్న విమర్శలున్నాయి. మొదటి వరల్డ్ కప్‌లో అతని జిడ్డు బ్యాటింగ్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 ఓవర్లలో 335 పరుగులు సాధించాల్సి ఉండగా, ఓపెనర్‌గా వచ్చిన గవాస్కర్ జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను నీరుగార్చాడు. నాటౌట్‌గా నిలిచిన అతను 174 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 60 ఓవర్లలో మూడు వికెట్లకు 132 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

బ్యాటింగ్‌లో విఫలం
బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినా బ్యాటింగ్‌లో విఫలమైన టెస్టు క్రికెటర్ల జాబితాలో భగవత్ చంద్రశేఖర్, క్రిస్ మార్టిన్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరూ టెస్టుల్లో చేసిన పరుగుల కంటే కూల్చిన వికెట్లే ఎక్కువ. 58 టెస్టులు ఆడిన చంద్రశేఖర్ 242 వికెట్లు పడగొట్టాడు. కానీ, అతను చేసిన పరుగులు 167 మాత్రమే. అదే విధంగా మార్టిన్ 71 టెస్టుల్లో 233 వికెట్లు సాధించాడు. చేసిన పరుగులు 123. స్పెషలిస్టు బౌలర్లు బ్యాటింగ్‌లో ఏవిధంగా విఫలమవుతారో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

బౌండరీలకు వ్యతిరేకి
సుడిగాలి బ్యాటింగ్ చేయడం ఇప్పుడు క్రికెట్‌లో ఫ్యాషన్. కానీ, ఒకప్పుడు కళాత్మక ఆటకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. గంటల తరబడి బ్యాటింగ్ చేసినా, భారీ షాట్లకు వెళ్లకుండా, సింగిల్స్, డబుల్స్‌తో స్కోరుబోర్డును ముందుకు దూకించేవాళ్లు. అనేకానేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా ‘లెజెండరీ బ్యాట్స్‌మన్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెరీర్‌లో 52 టెస్టులు ఆడి 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. 29 సెంచరీలు, 13 అర్ధ శతకాలు చేశాడు. సగటు ఇంత గొప్పగా ఉన్నప్పటికీ అతను కెరీర్ మొత్తంలో కేవలం ఆరు సిక్సర్లు మాత్రమే కొట్టాడం ఆశ్చర్యమే. ఫోర్లు అసలే లేవు. అప్పట్లో పవర్ గేమ్ జోలికి వెళ్లకుండా క్రికెటర్లు ఏ విధమైన కళాత్మక ఆటను కొనసాగించేవారో బ్రాడ్‌మన్ ఆరు సిక్సర్ల వైనం స్పష్టం చేస్తుంది.

- సత్య