ఆటాపోటీ

మెయిడిన్ల హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో వరుసగా ఎక్కువ మెయిడిన్లు వేసిన బౌలర్ బాపూ నాద్కర్ణి. భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించిన అతను 1964 జనవరిలో ఇంగ్లాండ్‌పై చెన్నై మ్యాచ్‌లో 32 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో 27 వరుస మెయిడిన్లు ఉన్నాయి. కేవలం ఐదు పరుగులిచ్చాడు. ఒక ఇన్నింగ్స్‌లో పది లేక అంతకంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్లలో అత్యంత తక్కువ పరుగులిచ్చిన ఘనత కూడా అతనికే దక్కుతుంది.

రెండు దేశాలకూ..
భారత క్రికెట్ జట్టు ఏర్పడక ముందు మన దేశానికి చెందిన చాలా మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేవారు. రంజిత్ సింగ్‌జీ, దులీప్ సింగ్‌జీ వంటి ఎంతో మంది ప్రముఖులు ఇంగ్లాండ్ క్రికెటర్లకే బ్యాటింగ్‌లో పాఠాలు నేర్పారు. అయితే, ఇంగ్లాండ్ జాతీయ జట్టు, ఆతర్వాత భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఆటగాడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ. టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తాత సైఫ్ అలీ ఖాన్. పటౌడీ కుమారుడి పేరు కూడా సైఫ్ అలీ ఖానే. ముత్తాత, తండ్రి మాదిరి అతను క్రికెటర్ కాలేదు. తల్లి, బాలీవుడ్ అలనాటి సుందరి షర్మిలా ఠాగూర్ లక్షణాలను పుణికిపుచ్చుకొని సినీ నటుడయ్యాడు.

వేలల్లో వికెట్లు..
ఆశ్చర్యం కలిగించే వాస్తవం ఇది. ఒక బౌలర్ వేల సంఖ్యలో వికెట్లు పడగొట్టడాన్ని ఎవరూ వినికూడా ఉండరు. కానీ, విల్‌ఫ్రెడ్ రోడ్స్ గణాంకాలు చూస్తే ఇది నిజమేనని అంగీకరించక తప్పదు. 52 సంవత్సరాలు అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను కొనసాగించాడు. కెరీర్‌లో 58 టెస్టులు ఆడిన ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ 2,325 పరుగులు చేసి, 127 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని రికార్డును బహూశా ఎవరూ బద్దలు చేయలేరేమో! 1,110 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 1,85,742 బంతులు వేశాడు. 70,322 పరుగులిచ్చి, 4,204 వికెట్లు పడగొట్టాడు. చేసిన పరుగులు కూడా తక్కువేమీ కాదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతను 39,969 పరుగులు సాధించాడు. మరో 31 పరుగులు చేసి ఉంటే, 40,000 పరుగుల మైలురాయిని చేరుకుని ఉండేవాడు.

- సత్య