ఆటాపోటీ

చిచ్చర పిడుగు లాడ్రాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో పోటీపడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు గ్రీక్ జిమ్నాస్ట్ దిమిత్రియస్ లాడ్రాస్ పేరుమీద ఉంది. 1896 ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ చిచ్చరి పడుగు వయసు 10 సంవత్సరాల 218 రోజులు. ఎంతో మంది అనుభవజ్ఞులతో తీవ్రంగా పోటీపడిన అతను కాంస్య పతకాన్ని సాధించాడు. తర్వాతి కాలంలో అతను గ్రీక్ నావికాదళంలో చేరి, అడ్మిరల్ స్థాయికి చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారిలో తక్కువ వయసుగల అథ్లెట్‌గా అతను నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

రెండు మస్కట్‌లు

సమ్మర్ ఒలింపిక్స్ రియో డి జెనీరోలో ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. పారాలింపిక్స్ సెప్టెంబర్ 7న మొదలై 18న ముగుస్తాయి. ఈ రెండు ఒలింపిక్స్‌కు వేర్వేరు మస్కట్‌లు ఉన్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ మస్కట్ పేరు ‘వినికస్’. కోతి, పిల్లి కలగలిపినట్టు ఉండే జంతువు రూపాన్ని మస్కట్‌గా ఎంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వింటర్ ఒలింపిక్స్‌కు మస్కట్‌గా ‘టామ్’ను సిద్ధం చేశారు. బ్రెజిల్‌లో కనిపించే వివిధ మొక్కల సమాహారంగా ఈ మస్కట్ దర్శనమిస్తుంది. ‘వినికస్’ పేరును ప్రముఖ సంగీత దర్శకుడు విన్సియస్ డి మోరాస్ పేరు మీద ఖరారు చేశారు. అదే విధంగా టామ్ జోబిమ్ పేరులోని ‘టామ్’ను పారాలింపిక్స్ మస్కట్‌కు ఖరారు చేశారు. ఈ పేర్లను ఖాయం చేయడానికి బ్రెజిల్‌లో ఓటింగ్‌ను నిర్వహించారు.

బూట్లు లేకుండానే..

ఒలింపిక్స్‌లో అథ్లెట్లు ధరించే బూట్లను స్పాన్సర్ చేయడానికి ప్రముఖ కంపెనీలు పోటీపడతాయి. ప్రముఖ అథ్లెట్లతో కొన్ని కంపెనీలు కాంట్రాక్టులు కూడా కుదుర్చుకుంటాయి. స్ప్రింట్, షార్ట్, మిడిల్ డిస్టెన్స్ రన్నర్లతో పోలిస్తే మారథాన్ రన్నర్ల పట్ల షూ కంపెనీలు ఆసక్తిని చూపుతాయి. వారు ఎక్కువ సేపు పరిగెడతారు కాబట్టి ఎక్కువ సమయం తమ బ్రాండ్‌కు ప్రచారం లభిస్తుంది. అందుకే షూ కంపెనీలకు మారథాన్ రన్నర్లంటే ప్రత్యేక అభిమానం. అయితే, ఇథియోపియా రన్నర్ అబేబ్ బికిలా తీరే వేరు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో అతను మారథాన్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. కాళ్లకు బూట్లు వేసుకోకుండానే అతను పరిగెత్తడం విశేషం. సామర్థ్యం ఉంటే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అతను నిరూపించాడు.

- సత్య