ఆటాపోటీ

సహనానికి పరీక్ష! -- పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే బ్యాట్స్‌మెన్ చాలా మందే కనిపిస్తారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్‌ను ఈ విషయంలో నంబర్‌వన్‌గా పేర్కొంటారు. కానీ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అతని కంటే ఘనుడు. 1983-84 సీజన్‌లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో అతను చివరి రోజు రెండో సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి, కేవలం నాలుగు పరుగులు చేశాడు. 2000 సంవత్సరంలో, అదే మైదానంలో, శ్రీలంకపై పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ ఖాన్ మూడో రోజు ఆటలో ఒక సెషన్‌లో ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టు నాలుగో రోజున దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా రెండో సెషన్‌లో ఆరు పరుగులు చేశాడు. బౌలర్ల సహనానికి ఇంతకంటే పరీక్షలు ఏముంటాయి?

టీనేజ్ క్రికెటర్లు
ఆడిపాడే టీనేజ్‌లోనే అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగిన కొంత మంది అమ్మాయిలు రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించారు. ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్ టీనేజ్‌లోనే క్రికెటర్‌గా ఎదిగింది. 2014 సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టి-20 మ్యాచ్‌తో ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాల 166 రోజులు. టెస్టు, వనే్డల్లో రికార్డు పాకిస్తాన్‌కు చెందిన క్రీడాకారిణి సాజిదా షా పేరిట ఉంది. ఆమె ఈ రెండు ఫార్మెట్స్‌లోనూ తన 12వ ఏటనే అడుగుపెట్టింది. పురుషుల విభాగానికి వస్తే, టి-20 ఇంటర్నేషనల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా హాంకాంగ్ ఆటగాడు వకాస్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 2014 నవంబర్‌లో కొలంబోలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడే సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు. టెస్టుల విషయానికి వస్తే పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ 2009లో తన 17వ ఏట తొలి మ్యాచ్ ఆడాడు.

లో స్కోరింగ్
టెస్టుల్లో లోస్కోరింగ్‌లోనూ కొన్ని జట్లు రికార్డులు నెలకొల్పాయి. భారత్‌పై ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 143.1 ఓవర్లు ఆడి 143 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఇంతకంటే తక్కువ స్కోర్లు కూడా నమోదైన సంఘటనలు టెస్టు క్రికెట్ చరిత్రలో ఉన్నాయి. 1954-55 సీజన్‌లో భాగంగా అక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ 27 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌట్ చేసింది. అంటే సగటున ఆ జట్టు స్కోరు ఓవర్‌కు 0.96 పరుగులు మాత్రమే. ఢిల్లీ టెస్టులో దక్షిణాఫ్రికా గుడ్డిలో మెల్లగా 0.99 పరుగులు చేయగలిగింది.

- సత్య