ఆటాపోటీ

సచిన్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత క్రికెటర్లలో సచిన్ తెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడాడు. ఆతర్వాతి తొమ్మిది స్థానాల్లో రాహుల్ ద్రవిడ్ (163), వివిఎస్ లక్ష్మణ్ (134), అనీల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), హర్భజన్ సింగ్ (103), వీరేందర్ సెవాగ్ (103) ఉన్నారు.
సెంచరీల్లో ‘టాప్-10’
టెస్టుల్లో ఎక్కువ శతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్ తెండూల్కర్‌ది అగ్రస్థానం. అతను 51 సెంచరీలు చేశాడు. తర్వాతి తొమ్మిది స్థానాల్లో వరుసగా రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గవాస్కర్ (34), వీరేందర్ సెవాగ్ (23), మహమ్మద్ అజరుద్దీన్ (22), దిలీప్ వెంగ్‌సర్కార్ (17), వివిఎస్ లక్ష్మణ్ (17), సౌరవ్ గంగూలీ (16), గుండప్ప విశ్వనాథ్ (14) ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 12 శతకాలు చేశాడు.
సూపర్ కుంబ్లే
* ప్రస్తుతం టీమిండియాకు కోచ్‌గా వ్యవహరిస్తున్న అనీల్ కుంబ్లే అత్యధికంగా 619 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 434 వికెట్లు కూల్చగా, హర్భజన్ సింగ్ ఖాతాలో 417 వికెట్లు ఉన్నాయి. ‘టాప్-10’లో జహీర్ ఖాన్ (311), బిషన్ సింగ్ బేడీ (266), భగవత్ చంద్రశేఖర్ (242), జవగళ్ శ్రీనాథ్ (236), ఇశాంత్ శర్మ (209), రవిచంద్రన్ అశ్విన్ (193), ఎరాపల్లి ప్రసన్న (189) ఉన్నారు. వీరిలో ఇశాంత్, అశ్విన్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. కాగా, ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన ఘనతను అనీల్ కుంబ్లే సొంతం చేసుకునాన్నిడు. 1999లో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 74 పరుగులకు పది వికెట్లు కూల్చాడు. జాసూ పటేల్ 1959లో ఆస్ట్రేలియాపై 69 పరుగులకు 9, కపిల్ దేవ్ 1983లో వెస్టిండీస్‌పై 83 పరుగులకు 9, సుభాష్ గుప్తే 1958లో వెస్టిండీస్‌పై 102 పరుగులకు 9 చొప్పున వికెట్లు కూల్చారు.
క్యాచ్‌ల్లో మేటి ద్రవిడ్
* టెస్టుల్లో ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడు రాహుల్ ద్రవిడ్. అతను 209 క్యాచ్‌లు పట్టాడు. వివిఎస్ లక్ష్మణ్ 135, సచిన్ తెండూల్కర్ 115, సునీల్ గవాస్కర్ 108, మహమ్మద్ అజరుద్దీన్ 105, వీరేందర్ సెవాగ్ 90, సౌరవ్ గంగూలీ 90, దిలీప్ వెంగ్‌సర్కార్ 78, సౌరవ్ గంగూలీ 71, కపిల్ దేవ్ 64, గుండప్ప విశ్వనాథ్ 63 క్యాచ్‌లు అందుకొని ‘టాప్-10’లో చోటు సంపాదించారు.
కాగా, ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన ఘనతను అనీల్ కుంబ్లే సొంతం చేసుకునాన్నిడు. 1999లో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 74 పరుగులకు పది వికెట్లు కూల్చాడు. జాసూ పటేల్ 1959లో ఆస్ట్రేలియాపై 69 పరుగులకు 9, కపిల్ దేవ్ 1983లో వెస్టిండీస్‌పై 83 పరుగులకు 9, సుభాష్ గుప్తే 1958లో వెస్టిండీస్‌పై 102 పరుగులకు 9 చొప్పున వికెట్లు కూల్చారు.

- సత్య