ఆటాపోటీ

గ్లోవ్స్ లేని రోజుల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చేతికి గ్లోవ్స్ వేసుకోకుండా ఎక్కువ ఫైట్స్‌లో పాల్గొన్న బాక్సర్ జాన్ సలీవాన్. ఒకసారి అతను పోటీపడిన ఫైట్ 75 రౌండ్ల వరకూ కొనసాగింది. చివరికి విజయం అతనినే వరించింది. 1918 ఫిబ్రవరి 2న గుండె పోటుతో సలీవాన్ మృతి చెందాడు. అది చలికాలం కావడంతో శ్మశాన వాటిలో నేలంతా గట్టిపడిపోయింది. అతని మృత దేహాన్ని ఖననం చేయడానికి నేలను డైనమేట్‌తో పేల్చాల్సి వచ్చింది. ఆ సంఘటనను పేర్కొంటూ, ఒవేళ సలీవాన్ బతికి ఉంటే, బలమైన పంచ్‌తో నేలను బద్దలు చేసేవాడని పత్రికలు పేర్కొన్నాయి. - శ్రీహరి

పంచ్ విసరకుండానే..
* ఒక్క పంచ్ కూడా విసరకుండానే ఒక రౌండ్‌లో గెలిచిన ఏకైక బాక్సర్ విల్లీ పెప్. అమెరికాకు చెందిన గుగ్లిమో పపోలియోను అందరూ విల్లీ పెప్ అని పిలిచేవారు. కెరీర్‌లో 241 ఫైట్స్‌లో పాల్గొని, 1,956 రౌండ్స్ ఫైట్ చేసి, 229 విజయాలు అందుకున్న అతను ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థిపై పంచ్‌లు విసరకుండా, అతను సంధించిన పంచ్‌లను తప్పించుకుంటా ఒక రౌండ్‌ను పూర్తి చేశాడు. బేజా రెత్తిన ఆ ప్రత్యర్థి చివరికి అలసిపోగా, పెప్ గెలుపొందాడు.

భయపడిందే జరిగింది..
* హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని దక్కించుకున్న ‘లెజెండరీ బాక్సర్’ సుగర్ రే రాబిన్సన్ ఏదైతే జరగకూడదని భయపడ్డాడో అదే జరిగింది. ప్రత్యర్థిని బలంగా కొట్టి, అతని మరణానికి కారణమవుతానేమోనని భయపడిన అతను బాక్సింగ్‌ను మానేయాలని అనుకున్నాడు. కానీ, మత పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని అతనిని ఫైట్‌కు ఒప్పించారు. అయితే, రాబిన్సన్ భయపడినట్టే జరిగింది. అతని పంచ్‌లను తక్కుకోలేకపోయిన ప్రత్యర్థి జమీ డోల్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

హోలీఫీల్డ్ సంచలనం
* మైక్ టైసన్‌తో పోటీపడనున్నట్టు ప్రకటించిన వెంటనే ఇవాండర్ హోలీఫీల్డ్‌కు చాలా మంది ‘త్వరగా కోలుకో’ అంటూ అతనికిసందేశాలు పంపారు. ఆ ఫైట్‌లో హోలీఫీల్డ్ తీవ్రంగా గాయపడతాడని అభిమానుల నమ్మకం. కానీ, 1996 నవంబర్ 9న జరిగిన ఆ ఫైట్‌లో హోలీఫీల్డ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయభేరి మోగించాడు. అతని పంచ్‌లకు తట్టుకోలేకపోయిన టైసన్ పలుమార్లు కుప్పకూలాడు. హోలీఫీల్డ్‌ను విజేతగా జడ్జిలు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరం, 1997 జూన్ 28న వీరిద్దరి మధ్య మరోసారి ఫైట్ జరిగింది. ఓటమి అంచున నిలిచిన టైసన్ ఆగ్రహాన్ని అణచుకోలేక హోలీఫీల్డ్ చెవి కొరికేశాడు.