ఆటాపోటీ

సవ్యసాచి వోరెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు సార్లు 500 లేదా అంతకు మించిన భాగస్వామ్యాన్ని అందించిన ఫ్రాంక్ ఓరెల్‌ను సవ్యసాచి అంటారు. అందుకు కారణం లేకపోలేదు. అతను కుడి చేత్తో బ్యాటింగ్, ఎడమ చేత్తో బౌలింగ్ చేసేవాడు. కెప్టెన్‌గా విండీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1962లో భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది. అప్పటి భారత కెప్టెన్ నారీ కాంట్రాక్టర్ బ్యాటింగ్ చేస్తూ చార్లెస్ గ్రిఫిత్ బంతి బలంగా తగలడంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి రక్తం అవసరమైతే వోరెల్ తన రక్తాన్నిచ్చాడు. తర్వాతి కాలంలో వోరెల్ పేరుతో బ్లండ్ బ్యాంక్ కూడా మొదలైంది.

‘బిగ్ బర్డ్’ గార్నర్
* ఫాస్ట్ బౌలర్ జోల్ గార్నర్‌ను ‘బిగ్ బర్డ్’ అనేవారు. ఇందుకు కారణం లేకపోలేదు. 1970, 1980 దశకాల్లో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన గార్నర్ ఎత్తు 6 అడుగుల, 8 అంగుళాలు. కింద పడిపోతాడా అన్న చందంగా బాగా వంగిపోయి అతను వేసే బంతులు మెరుపు వేగంతూ దూసుకొచ్చి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పట్టేవి. రనప్ మొదలుపెట్టిన క్షణాల్లోనే గార్నర్ బౌలింగ్ మార్క్ దగ్గరకు చేరేవాడు. పెద్దపెద్ద అంగలు వేస్తూ భీకరంగా కనిపించే గార్నర్‌కు ‘బిగ్ బర్డ్’ అన్న పేరు అతికినట్టు సరిపోతుంది.

ఆల్‌టైమ్ గ్రేట్ సోబర్స్
* క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్లలో గారీ సోబర్స్‌ను ప్రధానంగా పేర్కోవాలి. అసాధారణ ఆల్‌రౌండర్‌గా అతను పేరుతెచ్చుకున్నాడు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ అతనే. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అతనికి గోల్ఫ్ అంటే ఇష్టం. నెట్ ప్రాక్టీస్‌కు డుమ్మాకొట్టి ఎక్కువ సమయం గోల్ఫ్ కోర్స్‌లో గడపడం సోబర్స్ అలవాటు.

- సత్య