ఆటాపోటీ

లూయస్ ఔదార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మైదానంలోకి దిగిన తర్వాత ఎవరైనా తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయాలని, సాధ్యమైనన్ని తక్కువ పరుగులిచ్చి, ఎక్కువ వికెట్లు తీయాలని బౌలర్లు అనుకుంటారు. కానీ, ఆస్ట్రేలియా బౌలర్ మిక్ లూయిస్‌ను ఇందుకు మినహాయించాలి. 2006లో దక్షిణాఫ్రికాతో వాండరర్స్‌లో జరిగిన వనే్డలో అతను 10 ఓవర్లు బౌల్ చేసి, 113 పరుగులు సమర్పించుకున్నాడు. వనే్డల్లో ఇంతకంటే ఉదారంగా పరుగులను ధారాదత్తం చేసిన బౌలర్ ఇప్పటి వరకూ ఎవరూ లేరు.

మలింగ దాడి
* దక్షిణాఫ్రికాతో 2007లో జరిగిన వనే్డ మ్యాచ్‌లో లసిత్ మలింగ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అతని దాడికి జాక్వెస్ కాలిస్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మఖయా ఎన్తినీ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మలింగ చెలరేగినప్పటికీ శ్రీలంక ఒక వికెట్ తేడాతో ఆ మ్యాచ్‌ని కోల్పోవడం విచిత్రం.

హ్యాట్రిక్ హీరో
* మూడు వరుస బంతుల్లో ముగ్గురిని అవుట్ చేసి, హ్యాట్రిక్ సాధించడం కష్టం. వనే్డ, టి-20 ఫార్మాట్లతో పోలిస్తే, టెస్టుల్లో ఇది మరింత కష్టం. కానీ, టెస్టు క్రికెట్ చరిత్రలోనే, రెండు ఇన్నింగ్స్‌లోనూ హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ జిమీ మాథ్యూస్. వందేళ్లకు పైబడిన ఆ రికార్డును ఇప్పటి వరకూ ఎవరూ అధిగమించలేదంటే, అది ఎంత అరుదైనదో ఊహించుకోవచ్చు. 1912లో దక్షిణాఫ్రికాతో, తటస్థ వేదిక ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లోనూ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతకు ముందు, ఆతర్వాత ఇప్పటి వరకూ మరే బౌలర్‌కూ ఈ ఘనత దక్కలేదు.

- సత్య