ఆటాపోటీ

అభిమానికి అభిమాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక చిన్నారి అభిమానిని కలవడానికి అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. కాబూల్ క్రికెట్ సంఘం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల చిన్నారి ముర్తజా అహ్మదీకి మెస్సీ అంటే వల్లమాలిన అభిమానం. అతను ధరించే 10వ నంబర్ గల అర్జెంటీనా జెర్సీ రెప్లికాను కొనే స్థోమత అతని తండ్రికి లేదు. మెస్సీపై అహ్మదీకి ఉన్న అభిమానాన్ని గమనించిన అతని సోదరుడు హుమాయిన్ ఒక ప్లాస్టిక్ కవర్‌ను జెర్సీగా మార్చాడు. దానిపై మార్కర్ పెన్‌తో మెస్సీ అని రాశాడు. దాని కిందే 10 అంకె వేశాడు. ప్లాస్టిక్ బ్యాగ్‌తో తయారు చేసిన జెర్సీని వేసుకున్న అహ్మదీ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫొటో చాలా తక్కువ కాలంలోనే కొన్ని వేల మందిని ఆకర్షించింది. అహ్మదీ అనే ఓ చిన్నారి అభిమాని గురించి తమకు తెలుసునని మెస్సీ తండ్రి జార్జి ప్రకటించాడు. సాధ్యమైనంత త్వరలో అహ్మదీని కలవాలని మెస్సీ అనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే, అతనే స్వయంగా అఫ్గానిస్థాన్‌కు వస్తాడా లేక ఆ బాలుడినే స్పెయిన్‌కు పిలిపించుకుంటాడా అన్నది ఇంకా తెలియడం లేదు. ఆ బాలుడ్ని ఎప్పుడు కలవాలన్న అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద చిన్నారి అభిమాని అహ్మదీ పట్ల మెస్సీ ఆసక్తిని ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వార్నర్ క్రీడాస్ఫూర్తి

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి న్యూజిలాండ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వనే్డలో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి వార్నర్ ప్యాడ్స్‌కు తగిలినట్టు కనిపించింది. బౌల్ట్‌తోపాటు కివీస్ వికెట్‌కీపర్ ల్యూక్ రోన్చీ కూడా పెద్దగా అప్పీల్ చేశాడు. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జార్జి బెయిలీతో మాట్లాడిన వార్నర్ థర్డ్ అంపైర్ అభిప్రాయం కోసం అడగకుండానే క్రీజ్ విడిచి వెళ్లిపోయాడు. ఒకవేళ వార్నర్ కోరి ఉంటే, రీప్లేలో స్పష్టత లేని కారణంగా థర్డ్ అంపైర్ అతనిని నాటౌట్‌గా ప్రకటించేవాడు. కానీ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అతను స్వచ్ఛందంగానే పెవిలియన్ దారి పట్టాడు. వార్నర్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రేక్షకులు నిలబడి హర్షధ్వానాలు చేశారు. న్యూజిలాండ్‌లో ఒక విదేశీ ఆటగాడిగా స్టాండింగ్ ఓవేషన్ దక్కడం చాలా అరుదు. వార్నర్ ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.

- సత్య