ఆటాపోటీ

కాంబ్లీ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్ తెండూల్కర్‌కు సమవుజ్జీగా పేర్కోదగ్గ ఆటగాడు వినోద్ కాంబ్లీ. క్రమశిక్షణను పాటిస్తే కెరీర్‌లో ఎంత ఉన్నతంగా ఎదగవచ్చో చెప్పడానికి సచిన్ ఉదాహరణగా నిలిస్తే, క్రమశిక్షణ లేకపోతే, ఎంత ప్రతిభాశాలికైనా పతనం తప్పదని కాంబ్లీ కెరీర్ పాఠాలు నేర్పుతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించి, కెరీర్‌ను నాశనం చేసుకున్న కాంబ్లీ వివాదాల్లోనూ ముందుండేవాడు. తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ తెండూల్కర్ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, తనకు ఎలాంటి సాయం చేయలేదని 2009లో ఒక ఇంటర్వ్యూలో కాంబ్లీ ఆరోపించడం సంచలనం రేపింది. తన పతనాన్ని చూస్తూ ఊరుకున్నాడే తప్ప నిలువరించే ప్రయత్నం చేయలేదని సచిన్‌పై కాంబ్లీ ఆరోపణ. అంతటితో ఆగకుండా, 1996లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఫిక్సింగ్‌కు గురైందని ఆరోపించి మరో బాంబు పేల్చాడు. అయితే, ఎంతో మంది ఆటగాళ్లు అతని మాటలను ఖండించడంతో, ఫిక్సింగ్ ఆరోపణలకు ఎలాంటి విలువ లేకపోయింది.

చిత్రం.. సచిన్‌తో
కాంబ్లీ (ఎడమ)

- సత్య