ఆటాపోటీ

డాట్ బాల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒక ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ డాట్ బాల్స్ ఆడిన బ్యాట్స్‌మన్ డ్వెయిన్ బ్రేవో. 2009లో సెంచూరియన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన అతను 59 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేశాడు. వీటిలో 30 డాట్ బాల్స్. మొత్తం మీద ఐపిఎల్ టోర్నీలో ఎక్కువ బంతులను రక్షణాత్మకంగా ఆడిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. అతను 131 ఓవర్లలో , 3151 బంతులు ఎదుర్కొన్నాడు. వీటిలో 1,108 డాట్ బాల్స్.

నత్తనడక
* వేగంగా పరుగులు తీయడంలో రికార్డులు ఉన్నాయి.. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన అతను 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే, నత్తనడకన అర్ధ శతకం చేసిన బ్యాట్స్‌మన్ జీన్ పాల్ డుమినీ. ముంబయి ఇండియన్స్ తరఫున అతను 2009లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో దర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులు చేయడానికి 55 బంతులు మింగేశాడు. ఇది కూడా ఐపిఎల్‌లో ఒక రికార్డే.

37 సింగిల్స్!
* ఐపిఎల్ అంటేనే వీర బాదుడుగా చెప్పుకోవాలి. కానీ, ఈ ఫార్మాట్‌కు ఏ విధంగానూ సరిపోని సింగిల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చిన బ్యాట్స్‌మన్‌గా డేవిడ్ వార్నర్‌ను చెప్పుకోవాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ 2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. వీటిలో 37 పరుగులు సింగిల్స్ ద్వారా వచ్చినవే. ‘రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్’ ప్రాధాన్యతను ఎవరైనా అతని నుంచే నేర్చుకోవాలి.
**

- సత్య