ఆటాపోటీ

తప్పతాగి పిచ్చివాగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ ఏడాది పాటు దేశవాళీ వనే్డ టోర్నీల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇటీవల క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఒకీఫ్ పీకలదాకా తాగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులతోపాటు, సహచరులు, మాజీ క్రికెటర్లపైనా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. అతని పిచ్చివాగుడును సిఎ తీవ్రంగా పరిగణించింది. మైదానంలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, మైదానం వెలుపల అదే స్థాయిలో హుందాగా ప్రవర్తించడం లేదంటూ ఒకీఫ్‌పై ఆస్ట్రేలియా జట్టు పెర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్ పాట్ హోవర్డ్ మండిపడ్డాడు. 32 ఏళ్ల ఒకీఫ్ నిరుడు ఒక హోటల్‌లో తప్పతాగి, ఇష్టానుసారంగా ప్రవర్తించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఈ ప్రవర్తనను సిఎ ఎంతమాత్రం సహించదని స్పష్టం చేశాడు. ఆటగాళ్లు హుందాగా వ్యవహరించాలని, క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రవర్తించరాదని అన్నాడు. ఈ ఏడాది దేశవాళీ వనే్డ టోర్నీ నుంచి ఒకీఫ్‌ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడంపై ఎలాంటి నిషేధం లేదని వివరించాడు.

- సత్య