ఆటాపోటీ

సూపర్ సచిన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇరు జట్ల మధ్య జరిగిన వనే్డల్లో 2,000లకుపైగా పరుగులు చేసిన జాబితాలో ఇద్దరు భారతీయులుకాగా, మరో ఇద్దరు పాకిస్తానీలు. సచిన్ తెండూల్కర్ 66 ఇన్నింగ్స్‌లో 2,474 పరుగులు సాధించి, ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇంజమాముల్ హక్ 64 ఇన్నింగ్స్‌లో 2,403 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రాహుల్ ద్రవిడ్ 55 ఇన్నింగ్స్‌లో 2,008, సరుూద్ అన్వర్ 48 ఇన్నింగ్స్‌లో 2,002 చొప్పున పరుగులు చేశారు.
చెరి నాలుగు..
* భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మొత్తం 15 టెస్టు సిరీస్‌లు జరిగాయి. వీటిలో చెరి నాలుగు సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. మిగతా ఏడు సిరీస్‌లు డ్రా అయ్యాయి. అదేవిధంగా 17 ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌లు జరిగితే, పాక్ 11 సిరీస్‌లను గెల్చుకుంది. భారత్ ఖాతాలో ఐదు సిరీస్‌లు చేరాయి. మిగతావి డ్రా అయ్యాయి. టెస్టుల్లో సమవుజ్జీలుగా ఉన్నప్పటికీ, వనే్డలో పాక్ ఆధిక్యమే కొనసాగుతున్నది.

చిత్రం..సచిన్ తెండూల్కర్

- సత్య