ఆటాపోటీ

నోటి దురుసు! ( పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సాకర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి మొదట ఎల్లో కార్డు చూపి హెచ్చరిస్తారు. పదేపదే పొరపాట్లు చేసిన వారికి లేదా క్రీడాస్ఫూర్తిని దారుణంగా దెబ్బతీసిన వారికి రెడ్ కార్డు చూపి బయటకు పంపుతారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలోనే గెంటివేతకు గురైన ఆటగాడు లీ టాడ్. క్రాస్ పార్క్ ఫార్మ్ సెల్టన్ తరఫున 2000వ సంవత్సరంలో టాటన్ ఈస్ట్ రీచ్ వాండరర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండో సెకనులోనే రెడ్ కార్డుకు గురయ్యాడు. నోటి దురుసును ప్రదర్శించి, అసభ్యకరంగా తిట్టినందుకు రిఫరీ అతనికి రెడ్ కార్డు చూపి బయటకు పంపాడు. టాడ్ తర్వాతి స్థానంలో డేవిడ్ ప్రాట్ ఉన్నాడు. 2009లో అతను చిపెన్‌హామ్ టౌన్ తరఫున బాష్లేతో జరిగిన మ్యాచ్‌లో మూడో సెకనులోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతను కూడా నోటి దురుసుతోనే శిక్ష అనుభవించాడు.

పేపర్ ప్రకటనతో..
* స్పానిష్ క్లబ్స్‌లో మేటి జట్టు బార్సిలోనా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏర్పడిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, ఇది అక్షరాలా నిజం. తాను ఒక సాకర్ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని, ఆసక్తిగల వారు సంప్రదించాలని కోరుతూ ఫుట్‌బాల్ ప్రేమికుడు హన్స్ కాంపెర్ 1899 అక్టోబర్ 22న స్థానిక పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చాడు. జొవాన్ గాంపర్, గిమ్నాసియో సోల్‌సహా మొత్తం 13 మంది అతని ప్రకటనపై స్పందించారు. 1899 అక్టోబర్ 29న వారు సమావేశమయ్యారు. అదే రోజు బార్సిలోనా క్లబ్ మొదలైంది. 117 ఏళ్లుగా సాకర్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నది.

మిథ్యా నగరం!
* కూలీల ప్రాణాలను తీయడంలోనేకాదు.. ఇంకా రూపుదిద్దుకోని ఒక నగరంలో ఫైనల్ మ్యాచ్‌ని ప్రకటించడం కతార్ ఫిఫా వరల్డ్ కప్ ప్రత్యేకత. 2022 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లుసెల్ అనే నగరంలో జరుగుతుందని కతార్ అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకూ ఆ నగరం ఉనికే లేదు. వరల్డ్ కప్ హక్కులు సంపాదించిన తర్వాత కతార్ ఈ నగర నిర్మాణానికి నడుం బిగించింది. లేని నగరంలో ఫైనల్ ఏమిటన్న అనుమానం ఫిఫా అధికారులకు రాకపోవడం విచిత్రం.

- సత్య