ఆటాపోటీ

శతకాలతో ఆరంభం.. ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్‌తొలి, చివరి మ్యాచ్‌ల్లో శతకాలను నమోదు చేసిన బ్యాట్స్‌మన్ డెనిస్ అమిస్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మన్ 1972లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వనే్డ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మ్యాచ్‌లో 103 పరుగులు సాధించాడు.
1977లో ది ఓవల్ మైదానంలో అదే జట్టుతో చివరి వనే్డ ఆడి, 108 పరుగులు చేశాడు. మరో తొమ్మిది మంది మాత్రమే ఇప్పటి వరకూ వనే్డల్లో కెరీర్‌ను సెంచరీతో మొదలుపెట్టారు. కానీ, అమిస్ మాదిరి శతకంతో కెరీర్‌ను ముగించలేదు. 2014లో వెస్టిండీస్‌పై ఆడిన తన తొలి వనే్డలో సెంచరీ చేసి, గొప్ప భవిష్యత్తు ఉన్న బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సంపాదించిన మైఖేల్ లంబ్ ఆతర్వాత కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పూర్తిగా ఫామ్‌ను కోల్పోయిన అతని కెరీర్ ముచ్చటగా మూడు మ్యాచ్‌లతో ముగిసింది.

ప్రతిభావంతుడు మార్టిన్ క్రో
కేన్సర్‌తో బాధపడుతూ ఇటీవలే మృతి చెందిన మార్టిన్ క్రో క్రికెట్ ప్రపంచానికి న్యూజిలాండ్ అందించిన ఆణిముత్యం. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయానికి అతను టెస్టుల్లో 5,444 పరుగులు సాధించాడు. అప్పట్లో న్యూజిలాండ్ తరఫున అదే రికార్డు. ఆతర్వాతి కాలంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (7,172), బ్రెండన్ మెక్‌కలమ్ (6,452) అతని కంటే ఎక్కువ పరుగులు చేశారు. కానీ, క్రో కంటే వీరిద్దరూ ఎక్కువ టెస్టులు ఆడాడు. క్రో 77 మ్యాచ్‌లు ఆడగా, ఫ్లెమింగ్ 111, మెక్‌కలమ్ 101 చొప్పున టెస్టులు ఆడాడు. కాగా, అత్యధికంగా 17 టెస్టు సెంచరీలు సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా క్రో నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. రాస్ టేలర్, కేన్ విలియమ్‌సన్ చెరి 13 శతకాలతో క్రో రికార్డును సమీపిస్తున్నారు.

20 ఓవర్లు.. 81 రన్లు
ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 20 ఓవర్లలో కేవలం 81 పరుగులు చేయగలిగింది. కోటా ఓవర్లను పూర్తి చేసిన ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోర్ల జాబితాలో ఇది నాలుగోది. అయితే, ఆలౌట్ కాకుండా తక్కువ స్కోర్ చేసిన జట్ల జాబితాలో రెండోది. 2008 ఆగస్టులో బెల్‌ఫాస్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో కెనడాను ఢీకొన్న బెర్ముడా 70 పరుగులకే కుప్పకూలింది. 2014 నవంబర్‌లో కొలంబలో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడిననేపాల్ 72 పరుగులు చేయగలిగింది. 2010 ఫిబ్రవరిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. కాగా, టి-20 ఇంటర్నేషనల్స్‌లో అత్యల్ప స్కోరు 39 పరుగులు. 2014 టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా చిట్టగాంగ్‌లో శ్రీలంకతో తలపడిన నెదర్లాండ్స్ 10.3 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌటైంది.

- శ్రీహరి