ఆటాపోటీ

వయసుతో పనేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* క్రీడల పట్ల మక్కువ ఉండాలేగానీ, మైదానంలోకి దిగేందుకు వయసు అడ్డం కాదని నిరూపించాడు రాజా మహారాజ్ సింగ్. 72 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అదే అతనికి తొలి, చివరి మ్యాచ్. నాలుగు పరుగులు చేసిన అతను బౌలింగ్‌కు దిగలేదు. క్యాచ్ పట్టలేదు. సాధారణంగా కదలడానికి కూడా కష్టపడే వయసులో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఆడడమేగాక, జట్టుకు నాయకత్వం కూడా వహించిన ఘనత మహారాజ్ సింగ్‌కు దక్కుతుంది. కెరీర్‌లో మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఎక్కువ వయసుగల క్రికెటర్‌గా అతను నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
ట్రెమ్లెట్ దురదృష్టం
* క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. భవిష్యత్తులో ఎంతో మంది వస్తారు కూడా. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించినప్పటికీ, మూడో బంతిని అదే తీరులో వేయలేక హ్యాట్రిక్ అవకాశాన్ని చేజార్చుకున్నవారు సైతం ఉన్నారు. అయితే, క్రిస్ ట్రెమ్లెట్‌కు తొలి వనే్డలోనే హ్యాట్రిక్‌ను నమోదు చేసే అవకాశం అతని తప్పు లేకుండానే చేజారింది. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన ట్రెమ్లెట్ మూడో బంతిని కూడా అదే దిశలో సంధించాడు. బ్యాట్స్‌మన్‌ను ఏమారుస్తూ బంతి స్టంప్స్‌కు తగిలింది. కానీ, బెయిల్స్ కిందపడకపోవడంతో, బ్యాట్స్‌మన్ ఔట్ కాలేదు. ట్రెమ్లెట్‌కు హ్యాట్రిక్ లభించలేదు. బంతి వికెట్లకు తగిలినా లాభం లేకపోవడం దురదృష్టం కాకపోతే మరేమిటి?
దోషి ఎవరు?
* ఇంగ్లాండ్ క్రికెటర్ మోంటాగ్ డ్రూయిట్ 1988లో తన 31వ ఏట లండన్‌లోని థేమ్స్ నదిలో పడి మృతి చెందాడు. అంతకుముందు కొంతకాలంగా లండన్‌ను హడలెత్తించిన సీరియల్ కిల్లింగ్స్ అదే రోజుతో ఆగిపోయాయి. ‘జాక్ ది రిప్పర్’ ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసు రికార్డుల్లో ఉంది. డ్రూయిట్ మృతిచెందిన వెంటనే వరుస హత్యలకు తెరపడడంతో, అతనే ‘జాక్ ది రిప్పర్’ అనే అనుమానం వ్యక్తమైంది. 1970 దశకం వరకూ డ్రూయిన్ నిజంగానే హంతకుడా? అమాయకుడా? అన్న అంశంపై వాదోపవాదాలు కొనసాగాయి. చివరికి డ్రూయిస్‌కు ‘జాక్ ది రిప్పర్’తో ఎలాంటి సంబంధం లేదని ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. కానీ, ఇప్పటికీ అతనినే దోషిగా అనుమానిస్తున్నవాళ్లు లేకపోలేదు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరన్నది మిస్టరీగానే ఉంది.

- సత్య