ఆటాపోటీ

వంటల్లో మొనగాడు! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చాలా మంది క్రికెటర్లను ఖాళీ సమయంలో ఏం చేస్తారని అడిగితే, సినిమాలు చూస్తామనో, పుస్తకాలు చదువుతామనో చెప్తారు. కానీ, కోహ్లీ మాత్రం తల్లి సరోజ్‌తో కలిసి వంట చేస్తాడు. వివిధ రకాలైన వంటకాలు అతనికి ఇష్టం. అందుకు ఎప్పడు సమయం దొరికినా తల్లి దగ్గర వంట నేర్చుకుంటాడు. తానే సొంతంగా కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. వంటలోనూ అతను నంబర్ వనే్న!

టెన్నిస్ ఆడేస్తాడు!
* కోహ్లీకి క్రికెట్ అంటే ప్రాణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతనికి ఇష్టమైన మరో ఆట కూడా ఉంది. అదే టెన్నిస్. ఎప్పుడు సమయం దొరికినా అతను టెన్నిస్ బ్యాట్‌తో కోర్టులో ప్రత్యక్షమవుతాడు. జట్టు సభ్యులతో కలిసి ఉన్నప్పుడు మాత్రం వామప్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడతాడు. పంజాబీ సంగీతమన్నా అతనికి చాలా ఇష్టం. ఇంగ్లీషు, చరిత్ర అతనికి ఇష్టమైన సబ్జెక్ట్స్.

ఆటపైనే ధ్యాస
* మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు వేల సంఖ్యలో హాజరయ్యే ప్రేక్షకుల అరుపులతో స్టేడియం మారుమోగుతుంది. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడాలని అభిమానులు ఆశిస్తారు. స్టేడియంలో అరుపుల మోత ఏకాగ్రతను దెబ్బతీస్తే, వాళ్ల డిమాండ్ ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. కానీ, కోహ్లీ ఇవేవీ పట్టించుకోడు. ఎవరు ఏమనుకున్నా తాను ఎంపిక చేసుకున్న మార్గంలో వెళతానని అంటాడు. మైదానంలో ఆటగాళ్లు ఎదుర్కొనే సమస్యల గురించి చాలా మందికి తెలియదని, అలాంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లీ వాదన.
కోహ్లీ ఒక సంఘటనను పదేపదే చెప్తుంటాడు. అదే క్రికెట్‌లో తన ఆటతీరును మార్చేసిందని అంటాడు. విషయం ఏమిటంటే, 2011లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో మ్యాచ్‌కి రెండు రోజుల ముందు నుంచే మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా ఫోర్ కొట్టినట్టు సచిన్‌కు అనిపిస్తుండేది. అదే విషయాన్ని అతను తన సహచరులకు చెప్పాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చే మోర్కెల్ బంతిని నేరుగా షాట్ కొట్టడం సామాన్యమైన విషయం కాదు. కానీ బంతి ఎంత వేగంగా వచ్చిందో అంతకంటే వేగంగా సచిన్ దానిని వ్యతిరేక దిశలో బౌండరీకి తరలించాడు. ముందే ఒక దృశ్యాన్ని ఊహించడం, దానిని కళ్ల ముందు ఆవిష్కరించడం చాలా అరుదు. అలాంటి పట్టుదల ఉంది కాబట్టే క్రికెట్‌లో సచిన్ అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. కోహ్లీ అతని దారినే అనుసరిస్తున్నాడు. కేప్ టౌన్ సంఘటనను పదేపదే గుర్తు చేసుకుంటూ ముందుకెళుతున్నాడు.

- సత్య