ఆటాపోటీ

ఉత్తమ బౌలర్ మలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక సూపర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపిఎల్‌లో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతను 98 మ్యాచ్‌ల్లో 143 వికెట్లు కూల్చాడు. అమిత్ మిశ్రా 98 మ్యాచ్‌ల్లో 111, హర్భజన్ సింగ్ 111 మ్యాచ్‌ల్లో 110 చొప్పున వికెట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పీయూష్ చావ్లా 111 మ్యాచ్‌ల్లో 109, డ్వెయిన్ బ్రేవో 91 మ్యాచ్‌ల్లో 105 చొప్పున వికెట్లు పడగొట్టారు.
అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ సొహైల్ తన్వీర్ పేరిట ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 14 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. 2009లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అనిల్ కుంబ్లే 5, 2011లో కొచ్చి టస్కర్స్‌పై డక్కన్ చార్జర్స్ బౌలర్ ఇశాంత్ శర్మ 12, అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ముంబయి ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ 13, 2012లో డక్కన్ చార్జర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 16, 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ పేసర్ జేమ్స్ ఫాల్క్‌నెర్ 16 చొప్పున పరుగులిచ్చి తలా ఐదేసి వికెట్లు తమ ఖతాల్లో వేసుకున్నారు.