ఆటాపోటీ

ట్రోఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేసన్ మెలెరియో డిట్స్ మెల్లెర్ సంస్థ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీల డిజైన్‌ను ఖరారు చేసి, వాటిని తయారు చేస్తున్నది. నాణ్యమైన వెండితో తయారయ్యే ఈ ట్రోఫీలపై విజేతల పేర్లను చెక్కుతారు. అసలైన ట్రోఫీ ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల వద్ద ఉంటుంది. వెండితోనే తయారు చేసిన నమూనా ట్రోఫీలను విజేతలకు అందచేస్తారు. పురుషుల సింగిల్స్‌లో కూప్ డి మాక్వెటైరెస్, మహిళల సింగిల్స్‌లో కూప్ సుజానే లెంగ్లెన్, పురుషుల డబుల్స్‌లో కూప్ జాక్వెస్ బ్రునాన్, మహిళల డబుల్స్‌లో సిమోన్ మథియూ, మిక్స్‌డ్ డబుల్స్‌లో మార్సెల్ బెనార్డ్ ట్రోఫీలను విజేతలకు బహూకరిస్తారు.

16 ఏళ్ల వయసులో టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా మోనికా సెలెస్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 1990లో ఈ టైటిల్ గెల్చుకునే సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాల ఆరు నెలలు. అరంటా సాంచెజ్ వికారియో (1989), స్ట్ఫె గ్రాఫ్ (1987) టైటిళ్లు అందుకునే సమయానికి వారి వయసు 18 సంవత్సరాలు కూడా నిండలేదు. కాగా, అత్యంత పెద్ద వయసులో టైటిల్ అందుకున్న ఘనత ఆండ్రెస్ గిమెనోకు దక్కుతుంది. 1972లో మహిళల చాంపియన్‌షిప్ గెల్చుకునే సమయానికి ఆమె వయసు 34 సంవత్సరాల 10 నెలలు. కాగా, పురుషుల విభాగంలో మైఖేల్ చాంగ్ పిన్నవయస్కుడు. 1989లో అతను పురుషుల సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాల మూడు నెలలు. 18 ఏళ్లలోపే టైటిల్ సాధించిన వారిలో మాట్స్ విలాండర్ (1982) కూడా ఉన్నాడు. మహిళల విభాగంలో టైటిల్ సాధించిన తొలి చైనా క్రీడాకారిణి లి నా. 2011లో ఆమె టైటిల్‌ను దక్కించుకుంది.

క్రిస్ ఎవర్ట్ రికార్డు

మహిళల విభాగంలో క్రిస్ ఎవర్ట్ లాయిడ్ అత్యధికంగా 7 పర్యాయాలు టైటిల్ సాధించింది. ఆమె 1974, 1975, 1979, 1980, 1983, 1985, 1986 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన క్రిస్ ఎవర్ట్ తన కెరీర్‌లో మొత్తం 18 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను అందుకుంది. 1972లో ప్రొఫెషనల్‌గా అవతరించిన ఆమె 1989లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ప్రపంచ మేటి టెన్నిస్ క్రీడారిణుల జాబితాలో క్రిస్ ఎవర్ట్
స్థానం సంపాదించుకుంది. స్ట్ఫె గ్రాఫ్ ఆరు, జస్టిన్ హెనిన్ నాలుగు టైటిళ్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

- సత్య