బిజినెస్

పోస్టల్ బ్యాంకే నయం.. కనీస నగదు నిల్వ రూ. 50 రూ. 100తో ఖాతా ప్రారంభించుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 15: బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌లు, విత్‌డ్రాలపై చార్జీల మోత మోగుతున్న తరుణంలో పోస్ట్ఫాసు సేవలపై ప్రజలు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్ట్ఫాసు డెబిట్ కార్డుతో ఎక్కడైనా ఎన్ని లావాదేవీలు నిర్వహించినా చార్జీల భారం పడకపోవడంతో ఖాతాదారులు వీటిపై ఆకస్తి వీలుంది మరి. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై విధించిన విపరీతమైన ఆంక్షలు ఖాతాదారులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. నగదు డిపాజిట్‌ను నెలకు నాలుగు పర్యాయాలకు మాత్రమే అనుమతించి, ఆపై జరిగే డిపాజిట్‌లకు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు 150 రూపాయలతోపాటు సేవా పన్ను విధించాలని నిర్ణయించినది తెలిసిందే. అలాగే ఎటిఎం ద్వారా నగదు ఉపసంహరణలపై కూడా పలు చార్జీలు మోపాయ. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ కూడా ఖాతాదా రులపై చార్జీల భారం వేయనుంది. దీంతో ప్రస్తుతం బ్యాంకులో ఖాతాలు నిర్వహించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తరుణంలో కొద్ది నెలల కిందట పోస్ట్ఫాసులు సైతం ఎటిఎం సేవలను ప్రారంభించాయి. ఇప్పటికే పోస్ట్ఫాసుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు పోస్ట్ఫాసులో పొదుపు ఖాతా కలిగిన వ్యక్తి 50 రూపాయల కనీస నగదు నిల్వ ఉంచితే సరిపోతుంది. కొత్తగా ఖాతా తెరవాలంటే కేవలం 100 రూపాయలుంటే చాలు. ఖాతాదారులకు ఎటిఎం కార్డులను కూడా తపాలా శాఖ జారీ చేసింది. ఈ కార్డు ద్వారా పోస్టల్ ఎటిఎంలతోపాటు అన్ని బ్యాంకుల ఎటిఎంలలోను సేవలు పొందే అవకాశం ఉంది. ఎటిఎం సేవలకైతే పరిమితి అంటూ ఏమీ లేదు. దీనిపై ఛార్జీల భారం కూడా ఉండదు. దీంతో పోస్ట్ఫాసుల్లో పొదుపు ఖాతా ప్రారంభించాలని ఖాతాదారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ కెవిఎల్‌ఎన్ మూర్తి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా పోస్టల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. విస్తృత ప్రయోజనాలు ఉండటంతోపాటు ఖాతాదారులకు సమర్ధవంతంగా సేవలందించగల యంత్రాగం తపాలా శాఖకు ఉందని తెలిపారు. తమ రీజియన్ పరిధిలో ఇప్పటివరకూ 7,800 మందికి ఎటిఎం కార్డులు అందజేశామని చెప్పారు. రీజియన్ పరిధిలో 16 ఎటిఎంలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా వారానికి 4,200 లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు భవిష్యత్‌లో పోస్టల్ సేవలపట్ల మొగ్గు చూపుతారన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన కనబరిచారు.