జాతీయ వార్తలు

కన్నయ్యను చంపితే రూ. 11 లక్షల నజరానా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్ పొందిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ను కాల్చి చంపితే 11 లక్షల నగదు నజరానా ఇస్తామంటూ దిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరిట శనివారం వాల్‌పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. యుపి, బిహార్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పుకునే ‘పూర్వాంచల్ సేన’ పేరిట పోస్టర్లు వెలియడం సంచలనం సృష్టించింది. కాగా, కన్నయ్య నాలుకను కోసి ఇస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యుపికి చెందిన బిజెపి యువనేత కుల్‌దీప్‌ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ‘పూర్వాంచల్ సేన’ అధ్యక్షుడు ఆదర్శ్‌శర్మ పేరిట వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడంపై పోలీసులు దృష్టి సారించారు. కన్నయ్యకు వివిధ సంస్థల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అతనికి భద్రత కల్పించాలని దిల్లీ పోలీసులు నిర్ణయించారు.