జాతీయ వార్తలు

రామ్‌కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిలిపివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: జైల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న నిందితుడు రామ్‌కుమార్ మృత దేహానికి - తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పోస్ట్‌మార్టం ప్రక్రియను నిలిపివేయాలని పోలీసులు, ఆసుపత్రి వైద్యులను చెన్నై హైకోర్టు ఆదేశించింది. రామ్‌కుమార్ మృతిపై తండ్రి పరమశివం అనుమానం వ్యక్తం చేయడంతో దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. రామ్‌కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, వైద్య కమిటీ సమక్షంలో మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయాలని, దీన్ని వీడియోలో చిత్రీకరించాలని పరమశివం న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. జూన్ 24న నుంగంబక్కమ్ రైల్వే స్టేషన్‌లో టెక్కి స్వాతిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న జులై 1న పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన రామ్ కుమార్‌ను చికిత్స అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులోని విద్యుత్ తీగలను పట్టుకుని అతడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తన కుమారుడ్ని పోలీసులే జైల్లో చంపేశారని రామ్ కుమార్‌ తండ్రి పరమశివం ఆరోపిస్తున్నారు.