కమెడియన్ పొట్టి రాంబాబు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో ఆకస్మిక మరణాలు ఎక్కువౌతున్నాయి. ఇటీవలికాలంలో వరుసగా సినీనటుల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు రంగనాధ్ మృతి సంఘటనను మరువకుండానే మరో నటుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ‘ఈశ్వర్’ సినిమాతో కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పొట్టి రాంబాబు, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 35 సంవత్సరాలు. మెదడుకు సంబంధించిన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. హాస్యనటుడిగా 40కిపైగా చిత్రాల్లో నటించిన రాంబాబు ‘పులిరాజా ఐపిఎస్’ సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు మెదడుకు సంబంధించిన సమస్య రావడం ఆసుపత్రిలో చేరారు. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.