తెలంగాణ

ప్రజా ప్రయోజన సాధనే పత్రికల లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొత్తూరి వెంకటేశ్వరరావు
నక్కలగుట్ట, డిసెంబర్ 19: ప్రజలను ఆశ్రయించుకుని వార్తలు రాయాల్సిన పత్రికలు, ప్రస్తుతం ఆ దిశగా ప్రయాణం కొనసాగించడం లేదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్‌హాల్‌లో వరంగల్ వాణి దినపత్రికను నడిపిన ఎం.ఎస్ ఆచార్యుల రెండవ స్మారకోపన్యాసం జరిగింది. కెయు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సమావేశానికి పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా హాజరై పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు అనే అంశంపై ప్రసంగించారు. ప్రభుత్వం అనే ఒక మత్తగజాన్ని అంకుశంతో పొడిచి కదిలేలా చేయడమే మీడియా పని అని తెలిపారు. గతంలో పత్రికలో వార్త వచ్చిందటే అది అక్షర సత్యం, కాని నేడు ఏ పత్రికలో వచ్చిందో చూసి దాన్ని బట్టి పాఠకుల స్పందన ఉంటుందని వివరించారు. ప్రజాస్వామ్యానికి రాజకీయ పరిపాలన పోలీసు న్యాయ ఆర్థిక వ్యవస్థలు పంచేద్రియాల లాంటివని వివరించారు. కేంద్ర సమాచార కమీషనర్ మాడభూషి శ్రీ్ధర్ మాట్లాడుతూ పాత్రికేయులకు దేశ ప్రాంత కాల పరిస్థితులపై అవగాహన ఉండాలని అన్నారు. పాత్రికేయుడు ఏమి రాశాడనేది ముఖ్యం కాని, అది పెద్ద పత్రికనా చిన్న పత్రికనా అనేది ముఖ్యం కాదని వివరించారు. అనంతరం ప్రొఫెసర్ ఎం.రాజగోపాలాచార్యులు, సీనియర్ పాత్రికేయులు నర్సింహాచార్యులు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రంగారావు, అంపశయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు.