బిజినెస్

అదానీ పవర్ నష్టం రూ. 4,961 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పవర్ లిమిటెడ్ ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4,960.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో పన్ను అనంతర నికర లాభం 1,012 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు అదానీ పవర్ తెలియజేసింది.
ఇక సంస్థ ఏకీకృత ఆదాయం ఈసారి 6,586.4 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 7,756.9 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకీకృత ఆదాయం 10 శాతం క్షీణించి 23,203 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 25,734 కోట్ల రూపాయలుగా ఉందని అదానీ పవర్ ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ముంద్రా ప్లాంట్ కోసం నాన్-రికగ్నిషన్ ఆఫ్ కాంపెనే్సటరీ టారీఫ్ కారణంగానే ఈసారి ఆదాయం తగ్గినట్లు సంస్థ తెలిపింది.