ప్రకాశం

ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చెయ్యొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 19:ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేయవద్దని రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం జివోనెంబరు 633, 17ను విడుదల చేసిందని, దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజారోగ్యావేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో వివిధప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎన్ రంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రజారోగ్య వేదిక రాష్టక్రన్వీనర్ ఎన్ సురేష్ విచ్చేసి మాట్లాడుతూ ఈ జివో ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికి ఉన్న సిబ్బందిని, భవనాలను, ఇతర సౌకర్యాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారన్నారు. ల్యాబ్ పరీక్షలు చేసినందుకు ప్రైవేటు సంస్థలకు ఒక్కొక్కరికి 235రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, నిజంగా 30రూపాయలనుండి 40 రూపాయల కన్నా ఖర్చు కాదన్నారు. ప్రజారోగ్య వేదిక జిల్లాకార్యదర్శి కె రఘచంద్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఈసేవలు పిపిపి పద్ధతులు అమలు జరిపినప్పుడు సేవల నాణ్యతపై ప్రజలనుండి, పౌరసంస్థల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈసమావేశంలో ప్రజారోగ్యవేదిక జిల్లాకార్యదర్శి కె రఘచంద్, మెడికల్ అండ్ హెల్త్‌యూనియన్ నాయకులు టి వెంకటేశ్వర్లు, మెడికల్ రిప్రజెంటీటివ్ నాయకులు జనార్దన్‌రావు, కౌలురైతు సంఘం జిల్లాకార్యదర్శి పి హనుమంతరావు, జెవివి నాయకులు టి రంగారావు, కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి కె రఘరామ్, డైఫీ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

గడువు ముగిసిన
40 కేసుల మద్యం సీసాలు ధ్వంసం
గిద్దలూరు, డిసెంబర్ 19: 2006లో వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం కేసులను ఆదివారం గిద్దలూరు పోలీసులు స్థానిక అంబవరం వెళ్ళే రహదారిలో ధ్వంసం చేశారు. 2006లో సుమారు 40కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా అవన్నీ గడువుతేదీ దాటిపోవడంతో ధ్వంసం చేశారు.

ఖాతాదారుల సంక్షేమమే ఎపిజిబి ధ్యేయం
* ఎపిజిబి ఆర్‌ఎం సుబ్బారెడ్డి
మార్కాపురంటౌన్, డిసెంబర్ 19: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందడమే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ధ్యేయమని ఎపిజిబి రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎపిజిబి బ్రాంచ్ ప్రధమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు పొందినవారు సకాలంలో చెల్లిస్తుంటే కొత్తవారికి రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రజల కోసం అనేక సేవలను ఏర్పాటు చేశామని, ఆ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ కె నాగలక్ష్మీకుమారి అధ్యక్షత వహించగా వివిధ శాఖల బ్రాంచ్ మేనేజర్లు ఉమామహేశ్వరరావు, బివికె ప్రసాద్, ఖాతాదారులు పాల్గొన్నారు.