ప్రకాశం

ఎక్స్‌ప్రెస్ వే రోడ్డునిర్మాణానికి సర్వే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, మే 11: మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ వే రోడ్డు నిర్మాణానికి సర్వే ప్రారంభమైంది. ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి 200మీటర్లు (్ఫర్లాంగు వెడల్పు)తో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మండలంలోని గుడిపాడు, లక్ష్మీనారాయణపురం, సంగాపురం, పడమర వెంకటాపురం, ఒద్దిపాడు గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, జిల్లా నుంచి సర్వే బృందాన్ని జిల్లా అధికారులు పంపారు. గురువారం సర్వే కొలతలను ప్రారంభించారు. కారంచేడు, కొనకనమిట్ల, అద్దంకి సర్వేయర్లు కె రమేష్, యలమందరాజు, శ్రీనివాసరావు ఈ సర్వే చేపట్టారు. మండల సర్వేయర్ వెంకటరావు, ఆర్‌ఐ రాజేష్, విఆర్‌ఓలను రికార్డుపరంగా సహకరించేందుకు నియమించినట్లు తహశీల్దార్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సర్వే నెలరోజుల్లో పూర్తవుతుందని, 15.5 కిలోమీటర్లు, 383.89 ఎకరాలు ఈ రోడ్డు కింద భూములు పోతాయని, ఈ భూములకు సంబంధించి సబ్‌డివిజన్లు, ఏ సర్వే నెంబరులో ఏ రైతులు సాగులో ఉన్న వివరాలు, పట్ట్భాములు తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎన్డీఎ హయాంలో అభివృద్ధి కుంటుపడింది
- పనబాక, జెడి శీలం
పర్చూరు, మే 11: ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో దేశాభివృద్ధి కుంటుపడిందని మాజీ కేంద్ర మంత్రులు పనబాకలక్ష్మి, జెడి శీలం ఆరోపించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలో కరవు తాండవం చేస్తుందని తెలిపారు. మిర్చి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 రాయితీ అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైన నాయకులందరూ తిరిగి పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి, పర్చూరు, చీరాల, అద్దంకి నియోజకవర్గ బాధ్యులు ఎం కృష్ణారెడ్డి, ఎం నిషాంత్, సీతారామాంజనేయులు, స్థానిక నాయకులు ఎల్ శివ, వి అబ్రహాం, ఎన్ కిషోర్, పి రవి, కె మార్కు తదితరులు పాల్గొన్నారు.