ప్రకాశం

ముచ్చటగా నాల్గోసారి టిడిపి అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న దామచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 14: ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ ముచ్చటగా నాల్గోసారి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీపగ్గాలు చేపట్టి జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించటంలో దామచర్ల ముందువరసలో ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి నాల్గోసారి కూడా పార్టీపగ్గాలను అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2010-12 సంవత్సరంలో మొదటిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం 2012-14, 2014- 16 సంవత్సరం వరకు జిల్లాపార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతున్నారు. నాల్గోసారి కూడా దామచర్లను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి టిడిపిని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషిచేశారు. దామచర్ల అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు జిల్లాపార్టీ అధ్యక్షుడిగా కరణం బలరాం ఉన్నారు. ఆ సమయంలో కరణం బలరాం సమీప బంధువుకు చెందిన కార్యాలయంలో జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఉండేది. బలరాం తరువాత దామచర్లకు పార్టీపగ్గాలను చంద్రబాబు అప్పగించిన తరువాత ఆ కార్యాలయాన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే కోట్లాది రూపాయల విలువైన తన స్థలాన్ని జిల్లాపార్టీ కార్యాలయంగా మార్చారు. ఇప్పటికి తనస్వంత స్థలంలోనే పార్టీకార్యాలయ నిర్వహణ సాగుతుంది. తన స్వంత స్థలంలోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయటం పట్ల అప్పట్లో చంద్రబాబు దామచర్లను అభినందించటం జరిగింది. దామచర్ల జనార్ధన్ తాత దామచర్ల ఆంజనేయులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖమంత్రిగా దామచర్ల ఆంజనేయులు పనిచేశారు. ఆంజనేయులు చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండటంతో ఆయన మనవుడిగా జిల్లాపార్టీ పగ్గాలను అప్పగించారు. 2010 సంవత్సరం నుండి జిల్లాపార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని బలోపేతం చేశారు. కార్యాలయనిర్వాహణ బాధ్యతలతోపాటు, పార్టీ పురోభివృద్ధికి కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. ప్రస్తుతం జిల్లాపార్టీ పగ్గాలు చేపట్టేందుకు కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదన్న వాదన ఆ పార్టీ నేతల నుండి వినిపిస్తోంది. పార్టీ బాధ్యతలు మోయాలేంటే ఆర్థికపరంగా బలిష్టమైన నేత అవసరం ఉంది. అలాంటి నేతలు పార్టీపగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపించటంలేదు.
కాగా జిల్లాపార్టీ పగ్గాలు చేపడుతూనే మరొకపక్క ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యునిగా దామచర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గపరిధిలోని ఒంగోలు రూరల్, కార్పొరేషన్, కొత్తపట్నం మండలాల అభివృద్ధిపై దృష్టిసారించి తనమార్కును నిలుపుకున్నారు. ప్రధానంగా కొత్తపట్నం మండలంపై ఆయన ప్రత్యేకదృష్టి సారించి అన్నివిధాల అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడదూరంలో ఉండేదని, ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్‌గా ఒంగోలు మారిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. మొత్తంమీద ఈనెల 22, 23తేదీల్లో జిల్లాపార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దామచర్లను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి. జిల్లాలోని అద్దంకి, చీరాల, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాలపై మాత్రం దామచర్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పార్టీశ్రేణులు కోరుతున్నాయి.