ప్రకాశం

ప్రాణం తీసిన సెల్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, జూన్ 4: రాచర్ల మండలం జెపిచెరువు సమీపంలోని నల్లమలలో వెలసిన నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్దగల నెమలిగుండంలో మునిగి చిన్నబాబ్జీ (18) అనే యువకుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. కంభంకు చెందిన చిన్నబాబ్జీ స్నేహితులతో కలిసి ఆదివారం నెమిలిగుండంకు వచ్చారు. అయితే గుండంలో సరదాగా ఈత కొడుతూ గుండ్లకమ్మ కొండపై నుంచి కిందకు జాలువారే ప్రాంతానికి వెళ్ళి ఫోన్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు సమాచారం అందించడంతో రాచర్ల పోలీసులు అప్రమత్తమై నెమిలిగుండ్ల రంగస్వామి గుండంలో గజ ఈతగాళ్ళతో వెతుకులాడించడంతో బాబ్జీ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. కాగా, కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.