ప్రకాశం

మళ్లీ దామచర్లే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 18: జిల్లా తెలుగుదేశంపార్టీలో సరికొత్త రికార్డును జిల్లాతెలుగుదేశంపార్టీఅధ్యక్షుడు, ఒంగోలుశాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన దామచర్లకు మళ్లీ నాల్గోసారి పార్టీ బాధ్యతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అప్పగిస్తూప్రకటన చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా దామచర్ల అభిమానుల్లో ఆనందం నెలకొంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేని సమయంలోనే చిన్నవయస్సులోనే దామచర్ల జనార్దన్ 2010 సంవత్సరంలో జిల్లాపార్టీపగ్గాలను చేపట్టారు. 2012-14, 2014-16వరకు మూడుసార్లు జిల్లాపార్టీ బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా 2016-18 సంవత్సరం వరకు జిల్లాపార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో దామచర్ల ఓటమి పాలైనప్పటికి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా కరణం బలరామకృష్ణమూర్తి ఉన్న సమయంలో జిల్లాపార్టీకార్యాలయం ఆయన సమీపబంధువు స్ధలంలో ఉండేది. అనంతరం జరిగిన రాజకీయపరిణామాల నేపధ్యంలో కరణం బలరాం స్థానంలో దామచర్ల జనార్ధన్‌కు జిల్లాపార్టీ బాధ్యతలను అప్పగించారు. కాని ఆసమయంలో పార్టీకార్యాలయాన్ని బలరాం సమీప బంధువు తొలగించటంతో దామచర్ల కోట్లాధిరూపాయల తన స్వంత స్థలంలోనే పార్టీకార్యాలయాన్ని నిర్మించటం జరిగింది. దీంతో దామచర్లకు అధినేత చంద్రబాబువద్ద పెద్ద ప్లస్ అయినట్లైంది. మొత్తంమీద అప్పటినుండి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాపార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత ఆయన హైదరాబాద్ నుండి ఆంధ్రభూమిప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు. తనకు నాల్గోసారి జిల్లాపార్టీ పగ్గాలు అందచేసినందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు మూడుసార్లు తనకు సహకరించిన జిల్లాలోని పార్లమెంటుసభ్యులు, శాసనసభ్యులు, ఇన్‌చార్జులతోపాటు కుటుంబసభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల సందర్బంగా జిల్లాలోని నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు. పార్టీలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుని పార్టీని పకడ్బంధీ వ్యూహంతో ముందుకు వెళ్తానని తెలిపారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీచేసి పార్టీశ్రేణులకు న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జిల్లాపార్టీ అధ్యక్షునిగా ఉంటూనే తన స్వంత నియోజకవర్గమైన ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.ప్రధానంగా ఒంగోలుకు రోజు మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు పైపులైన్ ద్వారా నీరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. అదేవిధంగా మినిస్టేడియం నిర్మాణపనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రధానంగా కొత్తపట్నం మండలప్రజలకు వరప్రసాదిని అయిన నల్లవాగుపై నాలుగుకోట్లరూపాయలపైనే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈబ్రిడ్జి నిర్మాణపనులు పూర్తిస్ధాయి అయ్యేదశకు చేరుకున్నాయి. దీంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తిఅయితే భారీవర్షాలు, తుపాన్ల సమయంల్లోను కొత్తపట్నం మండల ప్రజలు ఒంగోలుకు రాకపోకలు జరిపే అవకాశం ఉంది. దీంతో భారీవర్షాల సమయంలో నల్లవాగు దాటకుండా యదేచ్చగా వాహనాలద్వారానే ప్రయాణం చేసుకునే వీలుఉంటుంది. ఈ బ్రిడ్జి కొత్తపట్నం మండల ప్రజలకు ఒక వరంగానే చెప్పవచ్చు. అదేవిధంగా బకింగ్‌హాం కెనాల్‌పై కూడా బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఆమేరకు బ్రిడ్జిపనులకు సంబంధించి దామచర్ల శంకుస్థాపన చేశారు. మొత్తంమీద కొత్తపట్నం మండల ప్రజలకు మాత్రం దామచర్ల ఎంతో అభివృద్ధిచేశారు. కాగా దామచర్ల జనార్దన్ నాల్గొసారి ఎన్నిక కావటం పట్ల జిల్లాలోని అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.