ప్రకాశం

‘బిసిలకే ఎఎంసి చైర్మన్ ఇవ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఏప్రిల్ 15: ఎఎంసి చైర్మన్ పదవి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బిసి సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఇవ్వాలని పలువురు మహిళా నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ బిసి ఐక్యవేదిక సమావేశం పట్టణంలోని స్థానిక ఆదిపరాశక్తి ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షురాలు అచ్చుకోలు వెంకాయమ్మ, కార్యదర్శి బుర్ల వెంకాయమ్మ తదితరులు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా నామినేటెడ్ పదవులు చేపట్టకపోవడం విచారకరమన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బిసిలకు ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షురాలు కర్పూరపు సుబ్బలక్ష్మి, సంయుక్త కార్యదర్శులు బిట్రా సీతామహాలక్ష్మి, గుంటి శశికళ, కోశాధికారి కె విజయలక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.