ప్రకాశం

అంతర్జాతీయ యోగాదినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 18:ఈనెల 21న అంతర్జాతీయయోగాదినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం యోగాదినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21వతేదీ ఉదయం ఆరుగంటలకే అంతర్జాతీయ యోగాదినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని పోలీసు పెరేడ్ మైదానంలో పకడ్బందీగా చేయాలన్నారు. ముందుగా కరపత్రాలు, బ్రోచర్లు తదితర ప్రచార సామాగ్రిని పంపిణిచేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రముఖులందరిని ఆహ్వానించాలన్నారు. పోలీసుపెరేడ్ మైదానం చుట్టుపక్కల పాఠశాలలను గుర్తించి విద్యార్థుల్లో యోగాపై అవగాహన కల్గించి వారంతా యోగాకార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. వర్షంపడితే ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. స్ధానిక యోగాకేంద్రాల వద్ద నిర్వాహకులను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లారెవిన్యూఅధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ఎస్‌సికార్పోరేషన్ ఇడి బి రవి, ఆయుష్‌శాఖ ఆర్‌డిడి శేఖర్ పాల్గొన్నారు.