ప్రకాశం

జిల్లా ఎస్పీగా యేసుబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 20 : జిల్లా ఎస్పీగా యేసుబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం ఈయన కడప ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న త్రివిక్రమ వర్మను ప్రమోషన్‌పై శ్రీకాకుళం బదిలీ చేశారు.

వైకాపా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి
జగన్‌ను సిఎం చేయాలి
- ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి
- ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న టిడిపి
- వైకాపా జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు, జూన్ 20: రాబోయే ఎన్నికల్లో వైకాపా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రాప్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీచేసే వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైకాపా రాష్ట్ర అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. వైకాపాజిల్లా ప్లీనరీ వైకాపా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంగళవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సమావేశంలో ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా టిడిపి, వైకాపా పార్టీల మధ్య రాష్ట్రంలో ఓట్ల తేడా చూస్తే కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ మధ్య కాలంలో వైకాపా రాష్ట్ర అధినేత జగన్ రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారని ఈకార్యక్రమం విజయవంతంగా జరిగినట్లు తెలిపారు. అయితే ప్రజల వద్దకు నియోజకవర్గ వైకాపా నాయకులు వెళ్లిన సమయంలో చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ప్రజల సమస్యలను కూడా పరిష్కరించలేదని వైకాపా నాయకుల దృష్టికి ప్రజలు తీసుకువచ్చినట్లు తెలిపారు. చంద్రబాబుపాలనలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాలేదని రైతులకు గిట్టుబాటుధరలు రావటం లేదని విమర్శించారు. అదేవిధంగా డ్వాక్రామహిళల రుణాలు పూర్తిగా రద్దుకాలేదని నిరుద్యోగ యువతకు నిరుద్యోగభృతి ఇవ్వలేదని విమర్శించారు. బాబు వస్తే జాబువస్తుందని యువత ఆశించి ఓట్లువేశారని అయితే చంద్రబాబు తనకుమారుడు లోకేష్‌కు జాబు ఇచ్చి యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు కేంద్రం నుండి ప్యాకేజిలు రూపంలో నిధులు తీసుకొచ్చుకుని లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. జిల్లాలో నిరుద్యోగసమస్య తీరాలంటే జిల్లాలో రామాయపట్నంపోర్టు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని అదే విధంగా కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ వచ్చేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని వెలుగొండప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.
వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజావ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబుపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని రాబోయే ఎన్నికల్లో వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమని జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్లీనరీసమావేశాల్లో పలు తీర్మానాలుచేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని, జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించినందున తగిన నిధులను జిల్లాకు కేటాయించి అభివృద్ధి చేయాలని,జిల్లాలోని వెలుగొండప్రాజెక్టుతోపాటు, అన్ని ప్రాజెక్టులకు నిధులుకేటాయించి పనులు వేగవంతంగా జరిగేలా చేయాలని చూడాలని,జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని, జిల్లాలోని ఫ్లోరైడ్ పీడితప్రాంతాల్లోని కిడ్నీ బాధితులను ఆదుకోవాలని, డ్వాక్రామహిళల రుణాలను పూర్తిగా రద్దుచేయాలని తదితర తీర్మానాలను చేసి ఆమోదించినట్లు తెలిపారు.
ప్లీనరీలో మాజీ మంత్రి జి పార్థసారధి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రభుత్వనిధులను దోచిపెడుతుందని అదేవిధంగా ఇసుక దోపిడి జరుగుతుందని మహిళలపై దాడులు, ఆరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. చంద్రబాబుపాలనలో పేదలకు ఇళ్లు, పెన్షన్లు రావాలంటే జన్మభూమి కమిటీలు చెబితేనే వస్తున్నాయని ఆరోపించారు.
అదే రాజశేఖర్‌రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అందినట్లు తెలిపారు. చంద్రబాబుపాలనలో కుటుంబ పాలన సాగుతుందని ఎన్‌టిఆర్ కుటుంబాన్ని మాత్రం నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ, శ్రీనివాసరావుకు మాత్రం మంత్రిపదవులు కట్టబెట్టి దోచుకునే విధంగా చూస్తున్నారని విమర్శించారు. మళ్లీమంచిరోజులు రావాలంటే జగన్ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్లీనరీలో రాష్టప్రార్టీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కిరాతకపాలన సాగుతుందని విమర్శించారు.చంద్రబాబుపై ప్రజల్లో పెద్దఎత్తున అసంతృప్తి ఇప్పటికే వచ్చిందన్నారు. రాష్ట్రం సంక్షోభంలో ఉందని తెలిపారు. ఆర్‌టిసిని నడిపేందుకు దిక్కులేదు, ఎయిర్‌లైన్స్ పెడతామని చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటన్నారు. విశాఖలో భూములను ఆపార్టీనాయకులు దర్జాగా కబ్జా చేస్తుంటే హుద్‌హుద్ తుపాన్‌లో కొట్టుకుపోయాయని అబద్దపు ప్రకటనలు చేయటాన్ని ఖండించారు.
ఈప్లీనరీలో జిల్లాపార్టీ ఇన్‌చార్జీ డిసి గోవిందరెడ్డి, మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆయానియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జులు ఐవిరెడ్డి, బుర్రా మధుసూదన్‌రావు,వరికూటి అశోక్‌బాబు, బూచేపల్లి శివప్రసాదురెడ్డి, గొట్టిపాటి భరత్, బాచిన చెంచుగరటయ్య,తూమాటి మాధవరావు,సామాన్యకిరణ్, యడం బాలాజి, మాజీశాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి, కెపి కొండారెడ్డి, పిడతల సాయికల్పనారెడ్డి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి అమృతపాణి, వైకాపా ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పంప్రసాదు, వైకాపా రాష్టన్రాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, శింగరాజు వెంకట్రావు, కెవి రమణారెడ్డి,వై వెంకటేశ్వరరావు, గొర్రిపాటి శ్రీను, ప్రభాకర్, మహిళా నాయకురాలు గంగాడ సుజాత, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు.