ప్రకాశం

స్వాతంత్య్రసమరయోధులను సన్మానించిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 15:71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అశ్వద్ధనారాయణ, గంగవరపు వందనం, టంగుటూరు ప్రకాశం పంతులు మనవుడు టంగుటూరి గోపాలక్రిష్ణను రాష్టప్రురపాలక శాఖమంత్రి పి నారాయణ శాలువతో సత్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం స్ధానిక పోలీసు కళ్యాణమండపంలో జరిగాయి. ఈసందర్బంగా నిర్మల హైస్కూలు విద్యార్ధులచే మా తెలుగుతల్లికి మల్లెపూదండ, సాయిబాబా సెంట్రల్ స్కూలు విద్యార్ధులో స్వాగతం, స్వాగతం అనే గీతం, జవహర్ నవోదయ విద్యార్ధులచే జాతీయ సమైఖ్యత గురించి నృత్యం చేశారు. మాంటిస్సోరి హైస్కూలు విద్యార్ధులచే అమరావతి గీతానికి నృత్యం చేశారు. ఎపిసోషల్ వెల్పేర్ పాఠశాల అద్దంకి విద్యార్థులచే ఈతరం నవతరం వందమాతం, ఒంగోలు డ్రీమ్స్ హైస్కూలు విద్యార్థులచే ఐ లవ్ ఇండియా, ఒంగోలు సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులచే పాడవోయి భారతీయుడా అనే గీతాలకు నృత్యప్రదర్శనచేసి ప్రేక్షకులను అలరించాయి. ఈసందర్భంగా పోలీసు కళ్యాణ మండపం ప్రాంగణంలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలియచేసే స్టాల్స్‌ను డిఆర్‌డిఎ, వ్యవసాయశాఖ, జిల్లా పంచాయితీశాఖ, మత్స్యశాఖ, డ్వామా, ఐసిడిఎస్, ఎస్‌టి కార్పొరేషన్, ఆయూష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మలేరియా,మెప్మా, జిల్లా పౌరసరఫరాలశాఖ, గృహనిర్మాణశాఖ, ఎపి మైక్రో ఇరిగేషన్ శాఖ, ఉద్యానవనశాఖలు ఏర్పాటుచేశారు.
ఈసందర్భంగా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 380మంది అధికారులు, ఉద్యోగులకు మంత్రి నారాయణ, జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ ప్రతిభాపురస్కారాలను అందచేశారు. అనంతరం డిఆర్‌డిఎ, ఎస్‌సి కార్పొరేషన్, ఎస్‌టి కార్పొరేషన్, మెప్మా శాఖలద్వారా 128కోట్లరూపాయల వనరులను అందచేశారు. మత్స్యశాఖద్వారా నాలుగుకోట్ల 96లక్షల రూపాయల విలువైన వివిధ రకాల పనిముట్లను లబ్ధిదారులకు అందచేశారు. పరిశ్రమల శాఖద్వారా 19మందికి 2.30కోట్లరూపాయల యూనిట్లను పంపిణిచేశారు. ఈకార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మద్యం బెల్టుషాపుపై దాడి
* 105 మద్యం బాటిళ్లు స్వాధీనం
కంభం, ఆగస్టు 15: కంభంలోని కందులాపురం సెంటర్‌లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మద్యం బెల్టుషాపు నిర్వహిస్తున్న మాణిక్యాలరావు దుకాణంపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ సిఐ నెహిమియాబాబు తెలిపారు. అందిన సమాచారం మేరకు దాడి చేశామని, ఈ దాడిలో 105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు మాణిక్యాలరావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తుంటే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడిలో ఎస్సై నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.

హత్యకేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
కంభం, ఆగస్టు 15: కంభంలోని సంగా వీధిలో గత గురువారం భార్య వరలక్ష్మిని హత్య చేసిన కేసులో భర్త నూనె రమేష్, అత్త తిరుపతమ్మ, మామ లక్ష్మయ్యలను మంగళవారం అరెస్టు చేసినట్లు మార్కాపురం సిఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతురాలు వరలక్ష్మిని అదనపుకట్నం కోసం హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి నిందితులైన భర్త, అత్తమామలను అరెస్టు చేశామని తెలిపారు. వీరు బేస్తవారపేటలోని పెట్రోల్‌బంకు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. గిద్దలూరు కోర్టులో మృతురాలు భరణం కేసు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామానాయక్, పోలీసులు పాల్గొన్నారు.