ప్రకాశం

కొండచిలువ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, సెప్టెంబర్ 19 : కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామం వద్ద మేదరమెట్ల, నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం కొండచిలువ కనిపించడంతో కలకలం రేగింది. రాత్రి ఏడుగంటల సమయంలో రహదారికి తూర్పువైపు ఉన్న పంట భూముల నుండి పడమరకు కొండ చిలువ పయనించడాన్ని కొందరు మోటార్‌సైకిలిస్టులు హెడ్‌లైట్ల వెలుతురులో గమనించారు. పది అడుగులకు పైగా ఉన్న కొండచిలువ రహదారిపై నెమ్మదిగా కదులుతుండటంతో యువకులు లారీలను ఆపి లారీల హెడ్‌లైట్ల వెలుగులో కొండ చిలువ రహదారి పక్కనే ఉన్న పంట భూముల్లోకి వెళ్ళేలా చేశారు. సుమారు పది నిమిషాలకు పైగా కొండ చిలువ పయనించడాన్ని గ్రామస్థులు, ప్రయాణికులతో పాటు అనేక లారీల డ్రైవర్లు తమ వాహనాలను ఆపి కుతూహలంగా కొండచిలువ ను వీక్షించారు. ఏది ఏమైనా ఈ అరుదైన కొండ చిలువ ప్రత్యేక్షం కావడంతో గ్రామస్థుల్లో కలకలం రేకెత్తించింది.