ప్రకాశం

డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 19: జిల్లాలో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన అరికట్టాలని, పారిశుద్ధ్యం మెరుగుపర్చేలా చూడాలని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మునిసిపల్ కమిషనర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ప్రతిగ్రామంలో ప్రతి ఇంటిలో ముగ్గురునుండి నలుగురు వరకు జ్వరాల బారినపడుతున్నారని, వైద్య ఆరోగ్యశాఖ సరైన సమయంలో స్పందించి వైద్యచికిత్సలు అందించటంలో విఫలమైందన్నారు. చాలా ఆరోగ్యకేంద్రాల్లో వైద్యాధికారులు, మందుల కొరత ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగటంలేదని తద్వారా ప్రజలు జ్వరాలబారినపడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ జ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో వైద్యశిబిరాలను నిరంతరం కొనసాగించి జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖాధికారులు గ్రామాల్లో పర్యటించాలని, కిందిస్థాయి ఉద్యోగులను గ్రామస్థాయిలో పర్యటించేలా చూడాలన్నారు. జ్వరాలు ప్రబలకుండా నియంత్రణ జరిగే వరకు అధికారులు పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో విషజ్వరాలు తగ్గేంత వరకు ప్రత్యేకంగా డాక్టర్లను నియమించి ఉదయంనుండి సాయంత్రంవరకు వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా దర్శి, తాళ్లూరు, యర్రగొండపాలెం, మార్కాపురంల్లో పర్యటించినప్పుడు చాలాచోట్ల ప్రజలు జ్వరాలబారిన పడి ఆరోగ్యం కుదుటపడేందుకు ఆర్థికంగా చాలా ఖర్చుపెట్టడటం జరిగిందన్నారు. గ్రామపంచాయితీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగటంలేదని, డ్రైనేజిల్లో పూడికతీయటం లేదన్నారు. పశువుల పేడ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడటం లేదన్నారు.జ్వరాలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట పారిశుద్ధ్య కార్మికులను ఆదనంగా నియమించుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది మందులను అందుబాటులో ఉంచుకుని ప్రజలకు మంచివైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.గ్రామపంచాయితీల్లో పారిశుద్యంపై, పంచాయితీ కార్యదర్శులపై ఆరోపణలు వస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు మెతకతనంగా వ్యవహరించకుడదని కఠినంగా వ్యవహరించినప్పుడే మంచిఫలితాలు వస్తాయన్నారు. ఈసందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె యాస్మిన్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా వ్యాధులు గత సంవత్సరంకంటే తగ్గాయని, డెంగ్యూకేసులు పెరిగాయన్నారు. వైరల్‌ఫీవర్స్‌లో ప్లెట్‌లెట్స్‌కౌంట్ తగ్గగానే భయబ్రాంతులకు గురిఅవుతున్నారని ఆమె మంత్రికి వివరించారు. దోర్నాల, యర్రగొండపాలెం, చీమకుర్తి, గిద్దలూరు దిగువమెట్టప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువుగా నమోదుఅయ్యాయన్నారు. ఈసందర్బంగా దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ దర్శినియోజకవర్గంలోని ఐదుమండలాల్లో జ్వరాలు ఎక్కువుగా ఉన్నాయని వైద్యశిబిరాలు నిర్వహించి జ్వరాలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేకాధికారి పోలప్ప మాట్లాడుతూ చెంచుగూడెంల్లో జ్వరాలు ఎక్కువుగానమోదు అయ్యాయని, గ్రామపంచాయితీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ జ్వరాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రబలకుండా నియంత్రించాలని, నూటికినూరుశాతం అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టిసారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కొండయ్య మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడటం జరిగిందని నియోజకవర్గంలోఏలాంటి మరణాలు సంభవించలేదన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ చీమకుర్తిలో జ్వరాలు సంఖ్య అత్యధికంగా ఉందని గ్రానైట్‌లో పనిచేస్తున్న కార్మికులు ప్రైవేటు గృహాల్లో ఎక్కువసంఖ్యలో నివశిస్తున్నారని వారి ఆరోగ్య పరిస్ధితిలు భాగలేవన్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లిఖార్జున్ మాట్లాడుతూ ఉలవపాడులో మాత్రమే సమస్య ఉందని ప్రస్తుతం పరిస్ధితులు అదుపులో ఉన్నాయన్నారు. కొండెపి నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఉదయభాస్కర్ మాట్లాడుతూ జ్వరాలు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ కొత్తపట్నం మండలంలో డెంగ్యూకేసు నమోదు అయిందన్నారు. పల్లెపాలెం,మోటుమాలలో జ్వరాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు.జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ గ్రామపంచాయితీల్లో ఫాగింగ్ చేపట్టాలని, డ్రైనేజిల్లో పూడిక తీయించాలని, అవసరమైన చోట పారిశుద్ధ్య కార్మికులను అదనంగా కేటాయించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని అదికారులను ఆదేశించారు. డ్రైనేజిల్లో ఆయిల్ బాల్స్‌వదలాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లటంలేదని, పారిశుద్యకార్యక్రమాలు సక్రమంగా నిర్వహించటం లేదని, అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాభావపరిస్ధితుల వలన ఈనెలాఖరువరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతిరోజు మానిటర్ చేస్తూ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఆరోగ్య పరీక్షల్లో భాగంగా రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు ప్లెట్‌లెట్స్ తగ్గాయని వెంటనే డెంగ్యూవ్యాధిగా నిర్దారణ చేయకుడదన్నారు. అన్ని ఆరోగ్యకేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచటం జరిగిందని అవసరమైనచోట కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లను నియమించటం జరిగిందని మంత్రికి కలెక్టర్ వివరించారు. ఈసమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.