ప్రకాశం

ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, సెప్టెంబర్ 19: ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలంటే సాధ్యమయ్యేది కాదని, కానీ ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. కురిచేడు మండలం అవులమంద పంచాయతీ పరిధిలోని రామాంజనేయ కాలనీ, ప్రతిజ్ఞపురి, నాంచారపురం గ్రామాలలో మంగళవారం సాయంత్రం మంత్రి శిద్దా ఇంటింట కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాంజనేయపురం కాలనీలో జరిగిన సమావేశానికి మండల టిడిపి కన్వీనర్ కె నాగరాజు అధ్యక్షత వహించారు. మూడు సంవత్సరాల మూడు నెలల పాలనలో ఎంతో అభివృద్ధి సాధించామని ఇంకా సాధించాలన్న తమనతో పని చేస్తున్నామని మంత్రి శిద్దా పేర్కొన్నారు. ఇంటింట ప్రచారంలో వ్యక్తగత సమస్యలు తెలుసుకొని వారి నుండి దరఖాస్తులు స్వీకరించి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోయేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికి అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు కలగనీయడం లేదన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ విదేశీ చదువుల కోసం ప్రత్యేక 225 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్టల్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం అందించారన్నారు. రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, గృహాల నిర్మాణం తదితర వౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న చొరవతో ప్రజలు పార్టీ పట్ల విధేయత చూపుతున్నారని అన్నారు. రామాంజనేయకాలనీ అటవీ ప్రాంతంలో నివశిస్తున్నవారికి అటవీ హక్కుల చట్టాన్ని అనుసరించి నివాశ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎఎంసి చైర్మన్, వైఎస్ చైర్మన్లు, మండల అధ్యక్షురాలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.