ప్రకాశం

ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, సెప్టెంబర్ 21: పొదిలి పట్టణంలోని పలు ఎరువుల షాపులపై గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వీరాంజనేయ ఫెర్టిలైజర్స్ షాపులో స్టాకు రిజిష్టర్‌లో వ్యత్యాసం ఉండటంతో మూడు లక్షల 76 వేల 975 రూపాయల విలువ గల ఎరువులను సీజ్ చేయడంతోపాటు షాపు యజమానిపై 6ఎ కేసు నమోదు చేశారు. అలాగే తిరుమల వెంకటరమణ ట్రేడర్స్‌లో ఎరువుల స్టాక్ రిజిస్టర్‌లో తనిఖీ జరిపి ఎక్కువగా వ్యత్యాసం ఉండటంతో ఆరు లక్షల 20 వేల 755 విలువ కలిగిన ఎరువులను సీజ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు బిటి నాయక్, సిఎం బాబు, ఒంగోలు వ్యవసాయ అధికారి పి వేణుగోపాల్, పొదిలి ఎఓ డి శ్రీనివాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో వ్యక్తి మృతి
కురిచేడు, సెప్టెంబర్ 21: మద్యం సేవించిన మైకంలో మురికికాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రమైన కురిచేడులో గురువారం వెలుగు చూసింది. ఎస్సై కిశోర్‌బాబు కధనం ప్రకారం గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం లింగమక్కపల్లి గ్రామానికి చెందిన ఆవులపెద్దఅంజయ్య మృతి చెందాడు. అంజయ్య కొద్దిరోజులుగా ఊరూరా తిరుగుతూ బుధవారం కురిచేడు చేరుకున్నాడు. అతని భార్య అతని నుంచి విడిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. బుధవారం కురిచేడులో మద్యం సేవించి రాత్రి మెయిన్ బజారులోని ఒక దుకాణం వద్ద మెట్లపై నిద్రించాడు. మద్యం మైకంలో కాలువలోకి జారిపడి ఊపిరి ఆడక మృతి చెందాడు.
నివాసాల మధ్య మద్యంషాపులు వద్దు
* మహిళల ఆందోళన
మార్టూరు, సెప్టెంబర్ 21: జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దని మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. మద్ధి లక్ష్మయ్య కంపెనీ ఎదురుగా నాగరాజుపల్లి రోడ్డులో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు వద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మంచినీరు దొరకని ప్రాంతమైన ఉందేమో గాని, మద్యం దొరకని ప్రదేశం అంటూ లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇళ్ల మధ్యలో, గుడికి సమీపంలో, పాఠశాలల వద్ద బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చి మద్యం షాపులు వీధికి ఒకటి చొప్పున పెట్టుకునేందుకు అనుమతినిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీఎత్తున పాల్గొన్నారు.

‘సహకార బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు’
పర్చూరు, సెప్టెంబర్ 21: జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు అందజేస్తున్నట్లు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ ఈదర మోహనబాబు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సహకార బ్యాంకు అధికారులు, డైరెక్టర్లు, సిఇఓలతో సమీక్ష సమావేశం జరిగింది. అ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ త్వరలో రైతులకు మూడవ విడత రుణమాఫీ అందజేస్తుందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 66వేల మంది రైతులకు రెండు విడతలుగా రుణమాఫీ కింద 91 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలని అన్నారు. సహకార బ్యాంకు ద్వారా గత సంవత్సరం స్వల్ప కాలిక రుణాలు, రూ.540కోట్లు ఇవ్వగా, ఈ సంవత్సరం రూ.707 కోట్ల రుణాలకు పెంచామని అన్నారు. దీర్ఘకాలిక రుణాలు రూ.95 కోట్లు ఇప్పటి వరకు రైతులకు రుణాలు ఇవ్వగా, మరో రూ.35 కోట్లు మేర రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 84 సహకార సంఘాలకు సంబంధించి గృహనిర్మాణాలకు ప్రహరిగోడ నిర్మాణా లకు, వౌలిక వసతులకు రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సహకార బ్యాంకు 2013లో రూ.25 కోట్ల నష్టాలతో ఉండగా 2016-17 సంవత్సరానికి రూ.80 లక్షలు లాభాలు ఉన్నట్లు తెలిపారు. బంగారంపై రూ 50కోట్ల రుణాలు, సహకార సంఘాల గ్రూపులకు రూ.40 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతుల సహాయార్ధం జిల్లాలో ధాన్యం, కందులు, మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణాలలోని సహకార బ్యాంకుల ఖాతాదారుల సౌకర్యార్ధం ఎటిఎంలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. సహకార బ్యాంకుల ద్వారా రుణాల పంపిణీ రికవరీ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఇఓ కె రాఘవయ్య, డిజిఎం డి అంజయ్య, పర్చూరు, ఇంకొల్లు సహకార బ్యాంకుల మేనేజర్‌లు విశే్వశ్వరరావు, లక్ష్మీనారాయణ, డైరెక్టర్ లు, సొసైటి కార్యదర్శులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.