ప్రకాశం

వైద్యశాలలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 21: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున స్థానిక ఏరియా వైద్యశాలలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని వైద్యశాల సూపరింటిండెంట్‌కు ఆర్డీఓ మల్లికార్జున సూచించారు. గురువారం స్థానిక ఏరియా వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వైద్యశాలలోని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అందిస్తున్న వైద్యసేవల గురించి సూపరింటిండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే కాలం కాబట్టి మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. అనంతరం వైద్యశాలలోని అన్ని వార్డులను మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, మున్సిఫల్ కమిషనర్ శ్రీనివాసన్, వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్యసేవలను గురించి ఆరా తీశారు. ఈ నెలలో ఇప్పటి వరకు అవుట్ పెషేంట్ విభాగంలో 10,298 మంది, ఇన్‌పెషేంట్స్ విభాగంలో 586 కేసులు నమోదు అయ్యాయని, అలాగే సాధారణ జ్వరాలతో 1098 మంది, డయేరియాతో 35మంది, విషజ్వరాలతో 36 మందికి చికిత్స చేసినట్లు వైద్యాధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. రోగులు అధిక సంఖ్యలో ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో గుర్తించి వారి వివరాలను డిఎంహెచ్‌ఓ, ఎంపిడిఓ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శివరాం, పి వెంకటేశ్వర్లు, సూపరింటిండెంట్ తదితరులు మాట్లాడుతూ వైద్యశాలలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై వెళ్లిన వైద్యులను తిరిగి ఇక్కడకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్ వి పూర్ణచంద్రరావు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేవరపల్లి చెరువు సర్వేను అడ్డుకున్న దళిత రైతులు
పర్చూరు, సెప్టెంబర్ 21: దేవరపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పెద్దచెరువు (కృష్ణంరాజు చెరువు) సర్వేను దళిత రైతులు గురువారం అడ్డుకున్నారు. జెసి ఆదేశాల మేరకు సర్వే చేయటానికి వచ్చిన డిఐ ముసలయ్య, అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దళిత రైతులు మాట్లాడుతూ పెద చెరువును గతంలో ఒకసారి సర్వే చేశారని, మళ్లీ ఇప్పుడు సర్వే చేయటం ఏమిటని అధికారులను ప్రశ్నించారుగతంలో తాము గ్రామంలోని వాగు పోరంబోకు, చిన్న చెరువులకు సంబంధించి సర్వే చేయమని తాము అర్జీలు సమర్పించిన ఇప్పటి వరకు సర్వే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సర్వేయర్‌ని అడ్డు కోవటంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి దళిత రైతులు రోశయ్య, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.