ప్రకాశం

జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 21 :ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు తెలిపారు. గురువారం స్థానిక పాత జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో ప్రజలు సాగు, తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ కాలువ ద్వారా ఆరు టిఎంసిల నీటిని విడుదల చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. జిల్లాలో మిర్చి పంట పండించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా రిమ్స్ ఆసుపత్రిలో, మార్కాపురం ప్రాంతీయ ఆరోగ్యకేంద్రంలో రక్తపరీక్షల ప్లేట్‌లెట్ మిషన్లు ఏర్పాటు చేయాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు పేర్లు పెట్టుకునేందుకు జిల్లా పరిషత్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. పాఠశాల నిర్మాణాలకు భూములు ఇచ్చిన దాతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రూ.10 లక్షలు విరాళాలు ఇచ్చిన దాతలకు రెండవ ప్రాధాన్యతగా పేర్లు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించేందుకు ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముఖ్యమంత్రిని కలుసుకుందామన్నారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సాగర్ కాలువ ద్వారా తాగునీరు విడుదల చేయాల్సిందిగా నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కోరామన్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ శాఖమంత్రి నీరు విడుదల చేసేందుకు హామీ ఇచ్చారన్నారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలను పరీక్షించేందుకు, రక్త నమునాలు పరీక్షించే ప్లేట్‌లెట్ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖమంత్రిని కోరతామన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అద్దంకి మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చైర్మన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు డెంగ్యూ, మలేరియా జ్వరాలతో అల్లాడిపోతున్నారన్నారు. రిమ్స్ ఆసుపత్రి, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిబ్బంది కొరత లేకుండా పటిష్టపరచాలన్నారు. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేందుకు రూ.130 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి పైపులైన్ నిర్మాణ పనులు చేపడతారన్నారు. జిల్లా పరిషత్‌కు రావాల్సిన రూ.250 కోట్ల సీనరేజ్ ఫీజును ప్రభుత్వం నుంచి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు పోతుల సునీత మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. అధికారులు జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులను అధికారులు భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. శాసనమండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో రాయలసీమ కంటే ప్రకాశం జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతమన్నారు. వెనుకబడిన జిల్లాగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మిర్చిపంట పండించి నష్టపోయిన 16వేల మంది రైతులకు రూ.519 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. దీంతోపాటు రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ విపత్తు కింద జిల్లాకు కరవు సహాయం అందించాలని ఆయన కోరారు. ఒంగోలు డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని లాభాల బాటలో నిలిపి రైతులను, ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాల వల్ల ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చి సౌకర్యాలు కల్పించి ఆసుపత్రిని పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక జ్వరపీడితుడు ఉన్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ, మత్స్యశాఖ, పర్యావరణశాఖ, గనుల శాఖ, రహదారులు, భవనాల శాఖ, గృహనిర్మాణ, ఉపాధికల్పన శాఖ, స్టెప్, బిసి, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కార్పొరేషన్, వ్యవసాయం, మార్కెటింగ్, బిసి కార్పొరేషన్ల పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఒ బివి సాయికుమారితోపాటు వివిధ శాఖల అధికారులు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు. కాగా రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులను రాబట్టడటంలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అసమర్ధులని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఎంఎల్‌సి కరణం బలరాం మాట్లాడుతూ నిధులు రాబట్టడంలో, సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ముందు ఉంటారని చైర్మన్‌కు కౌంటర్ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లామంత్రి సమక్షంలో పార్టీలకు అతీతంగా జిల్లా సమస్యలపై ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాని ప్రజాప్రతినిధులకు సమర్ధత లేక కాదన్నారు. మైండ్‌సెట్ మార్చుకోవాలని రాజకీయ నాయకులు వ్యాపారమయంగా చూడకూడదని బలరాం చైర్మన్‌కు హితవు పలికారు.