ప్రకాశం

జిల్లాకు 6టిఎంసిల సాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 22: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 టిఎంసిల సాగర్‌నీరు విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది. ఆ మేరకు ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌పి ఇరిగేషన్ అధికారులు, ఒంగోలు కార్పొరేషన్ అధికారులు గురువారం తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన అనుమతి మేరకు శనివారం జిల్లాలోని సాగర్ రైట్ కెనాల్‌కు సాగర్‌నీటిని ఎన్‌ఎస్‌పి అధికారులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగర్ విడులచేసిన తరువాత మరో నాలుగు రోజులలో జిల్లాలోని రామతీర్థం రిజర్వాయర్‌కు నీరు చేరే అవకాశం ఉన్నట్లు ఆయా శాఖల అధికారుల ద్వారా సమాచారం. రామతీర్థం రిజర్వాయర్‌కు చేరిన వెంటనే ఆ నీటిని ఒంగోలులోని మొదటి, రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు నింపేందుకు కూడా ఒంగోలు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్ నీరు ఒంగోలుకు చేరే వరకు నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవు, ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ అధికారులు నగర ప్రజలకు వారానికి ఒక సారి సరఫరా చేస్తున్న తాగునీటి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంత ప్రజల పరిస్థితి అయితే మరింత దుర్భంగా ఉంది. శివారు ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే మరింత దుర్భరంగా ఉంది. శివారు ప్రాంతాల కాలనీలు అయిన పులివెంకటరెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జాషువా కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టి ఆర్ కాలనీ, బాలినేని భరత్ కాలనీ, బలరామకాలనీ, కేశవరాజు కుంట , మారుతి నగర్ తదితర కాలనీల ప్రజల తాగునీటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పులివెంకటరెడ్డి కాలనీ వాసులు అయితే గత రెండు రోజుల క్రితం తమ కాలనీకి తాగునీరు 10 రోజులకు ఒక సారి కూడా రావడం లేదని, దీంతో తాము తాగునీటికి తీవ్రంగా కష్టాలు పడాల్సి వస్తుందని రోడ్డు ఎక్కి రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సమస్య తీవ్రతను గ్రహించిన రాష్ట్ర మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు తోపాటు, ముఖ్యంగా ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధనరావు, జిల్లా ఉన్నతాధికారులు, ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ ఎస్ వెంకటకృష్ణలు జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తోపాటు, ఒంగోలు నగర ప్రజలు ఎదుర్కోంటున్న తాగునీటి కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోపాటు, రాష్ట్ర బారినీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం 6 టిఎంసిల సాగర్ నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సాగర్ నీటిని ముందుగు శనివారం నాడు ప్రకాశం జిల్లాలోని సాగర్ కాలువ రైట్ కెనాల్‌కు విడుదల చేసేందుకు ఎన్‌ఎస్‌పి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకు విడుదలైన సాగర్ నీటిని ముందుగా జిల్లాలోని రామతీర్థం రిజర్వాయర్‌కు నింపుకుని, ఆ తరువాత రామతీర్థం జలాశయం నుండి ఒంగోలుకు సాగర్‌నీరు చేరిన వెంటనే ఒంగోలు నగరంలోని మొదటి, రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు సాగర్ నీటిని పూర్తిస్థాయిలో నింపుకునేందుకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్ నీరును సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు పూర్తిస్థాయిలో నింపిన వెంటనే నగర ప్రజలకు రోజు మార్చి రోజు లేదా 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సాగర్ నీరు విడుదల చేస్తున్నపటికి ఆ నీరు ఒంగోలు కు ఎప్పుడు చేరుతుందో ఏమో తమ తాగునీటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని నగర ప్రజలు వాపోతుండగా, మున్సిపల్ శాఖాధికారులు మాత్రం సాగర్ నీరు మరో నాలుగైదు రోజులలో ఒంగోలకు రానున్నందన్న నగర ప్రజల తాగునీటి ముప్పు తప్పినట్లేనని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా గత రెండు నెలల క్రితం ఒంగోలు నగరంలోని మొదటి, రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులలో తాగునీరు అడుగంటి పోవడంతో మున్సిపల్ శాఖాధికారులు తొలుత నగర ప్రజలకు 6 రోజులకు ఒక సారి, ఆ తరువాత 10 రోజులకు ఒకసారి తాగునీటిన సరఫరా చేశారు. దీంతో నగర ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక సమయంలో అయితే నగర ప్రజలకు 15 రోజులకు ఒక సారి తాగునీరు సరఫరా చేస్తారేమో అనే చర్చ కూడా ప్రజలలో నెలకొంది. ఇలాంటి సమయంలో నగర ప్రజల తాగునీటి కష్టాలను అర్ధం చేసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు జిల్లాలోని గుండ్ల కమ్మ ప్రాజెక్టుకు ఇటీవల పైన కురిసిన వర్షాలకు కొంత మేర నీరు నిల్వ చేరడంతో ఆ నీటిని ముందుకు పైపు లైన్ ద్వారా ఎడుగుండ్లపాడు చెరువుకు నింపి, ఆ తరువాత ఏడుగుండ్లపాడు చెరువు నుండి పైపులైన్ ద్వారా ఒంగోలు నగరంలోని రంగారావు చెరువుకు నింపి, ఆ నీటిని ఫిల్టర్‌బెడ్‌కు పంపింగ్ చేస్తే నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కవర్ చేయవచ్చేనే ఉద్దేశంతో అధిక ఖర్చును కూడా లెక్క చేయకుండా తక్షణ మే 10 లక్షల రూపాయల నిధులను కేటాయించి గుండ్లకమ్మ నీటిని ఒంగోలుకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నీరు ఒంగోలుకు చేరడంతో ఆ నీటిని పిల్టర్ బెడ్‌కు నింపి ప్రస్తుతం నగర ప్రజలకు వారానికి ఒక సారి సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు వెంటనే స్పందించకుంటే నగర ప్రజలు మరింత నీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఏది ఏమైనప్పటికీ మరో నాలుగు రోజులలో సాగర్‌నీరు ఒంగోలుకు చేరనుండటంతో నగర ప్రజల తాగునీటి ముప్పు తప్పినట్లుగానే భావించాలి .