ప్రకాశం

ఎసిబికి చిక్కిన ఎన్‌ఎస్‌పి డిఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, సెప్టెంబర్ 22: అద్దంకి ఎన్‌ఎస్‌పి డిఇ కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం అవినీతి నీరోధక శాఖ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎన్‌ఎస్‌పి కార్యాలయంలో గత డిఇగా పనిచేస్తున్న చంద్రవౌళి కొరిశపాడు మండలం దైవలరావురు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుండి కాంట్రాక్ట్ బిల్లు చెల్లించేందుకు 25 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. డిఇ చంద్రవౌళితోపాటు అదే కార్యాలయంలో పనిచేస్తున్న జెఇ అనిల్, సీనియర్ అసిస్టెంట్ అర్జున్‌ను కూడా విచారించారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్‌పి తోట ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడితే 8333995859 నెంబరులో సంప్రదించాలన్నారు.