ప్రకాశం

భవానీదేవి అలంకరణలో వాసవీమాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 23: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం అమ్మవారు భవానీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా మహిళా భక్తులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. భరతనాట్యం, డ్యాన్స్‌బేబి డ్యాన్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వాసవీకన్యకాపరమేశ్వరిదేవి మూలమంత్ర జపం, దుర్గాసూక్తం, శ్రీసూక్త పారాయణం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే అమ్మవారికి లలితాసహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈకార్యక్రమాలను ఆలయ అధ్యక్షులు వక్కలగడ్డ మల్లిఖార్జున్, కార్యదర్శి పాదర్తి వెంకటనారాయణ, కోశాధికారి బివి సుధీర్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.