ప్రకాశం

తాళం వేసి ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 23: తాళంవేసి ఉన్న ఇళ్ల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉచిత సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు కోరారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా గృహ యజమానులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే సమయంలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇంటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీ చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలను భర్తీచేస్తే ఆమోదిస్తూ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడి ఇస్తారని తెలిపారు. ఎప్పుడైనా ఇంటికి తాళంవేసి వెళ్ళినట్లయితే యాప్‌లోని రెక్వెస్ట్ వాచ్‌లో పలానా రోజు నుంచి పలానా తేదీ వరకు ఇంటికి తాళంవేసి వెళ్తున్నట్లు సమాచారం అందించాలి. అనంతరం పోలీసులు ఇంటికి వచ్చి వైర్‌లెస్ కెమెరాలను ఏర్పాటుచేస్తారని, ఇందులో 6గంటల పాటు పనిచేసే బ్యాటరీ ఉంటుందని, ఒకవేళ దొంగలు తెలివిగా విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ వారి కదలికలను ఆ కెమెరా రికార్డు చేస్తుందని, అలాగే ఈ సమాచారం పోలీసుస్టేషన్‌కు అందుతుందని, అలాగే ఆ ఇంటి యజమాని ఫోన్‌కు రింగ్ కూడా వస్తుందని, దీంతో అలర్ట్ అయి దొంగతనాన్ని నివారించవచ్చునని, దాంతో మీ విలువైన వస్తువులకు భద్రత కలుగుతుందని, దీనివలన పోలీసులపై పనిభారం తగ్గుతుందని డివైఎస్పీ తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇకపై పోలీసుశాఖవారు పట్టణంలో సంచరిస్తూ ఈ యాప్ రిజిస్ట్రేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై పాత్రికేయులకు లాప్‌టాప్ ద్వారా డివైఎస్పీ రామాంజనేయులు అవగాహన కల్పించారు. పాత్రికేయుల సమావేశంలో రూరల్ ఎస్సై మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.