ప్రకాశం

ఈతముక్కలలో ఎమ్మెల్యే దామచర్ల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపట్నం, ఏప్రిల్ 17: జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆదివారం మండలంలోని ఈతముక్కల గ్రామంలో పర్యటించారు. ఈతముక్కలలోని చైతన్య హేచరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దివంగత పారిశ్రామికవేత్త దివి దిలీప్‌కుమార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పార్టీ నేతలతో కొద్దిసేపు పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఆయన వెంట జిల్లాపార్టీ ఉపాధ్యక్షుడు గేనెం సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు అయిల సుబ్బారావు, ఎంపిటిసి నాటారు తిరుపతిరెడ్డి, తెలుగుదేశంపార్టీ నాయకుడు వడ్డెర్ల మాధవ, మేకల జక్రయ్య, ఈతముక్కల సర్పంచ్ పి పద్మ, మడనూరు సర్పంచ్ కత్తి పద్మ, నందకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆటో బోల్తా :
ఏడుగురికి గాయాలు
పొదిలి, ఏప్రిల్ 17: ఆటో బోల్తాపడి ఏడుగురు గాయాలైన సంఘటన పొదిలి పట్టణశివారులోని దర్శిరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంకుచెందిన పదిమంది ఒక ఆటోలో పొదిలిలో జరగనున్న ఒక శుభకార్యక్రమానికి వస్తుండగా మార్గమధ్యంలోని పొదిలిపట్టణ శివారులో ఆటో అదుపుతప్పిబోల్తాపడింది. ఈప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన షేక్‌కరీమూన్, ఖాసీం, మరోక వ్యక్తిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రధమ చికిత్సఅనంతరం వారి పరిస్ధితి ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన వైద్యనిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. స్వల్పగాయాలైన మిగిలిననలుగురు పొదిలివైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. ఈసంఘటనపై పొదిలి ఎస్‌ఐ కె శశికుమార్ కేసు దర్యాప్తుచేశారు.

ముగిసిన క్రికెట్ పోటీలు

పర్చూరు, ఏప్రిల్ 17: మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో గత వారం రోజుల నుంచి ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిసాయి. మక్కెన రామసుబ్బయ్య మెమోరియల్ చిలకలూరిపేట జట్టు ప్రధమ బహుమతిని గెలుచుకుంది. ఫైనల్ పోటీల్లో రామసుబ్బయ్య మెమోరియల్ చిలకలూరిపేట జట్టుకు, పడమటి ఫ్రెండ్స్ వీరన్నపాలెం జట్ల మధ్య మ్యాచ్ జరుగగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పేట జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు సాధించింది. 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పడమటి ఫ్రెండ్స్ జట్టు 15 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పేట జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొంది ప్రధమ బహుమతి రూ.25,116 నగదుతో పాటు జ్ఞాపికను అందుకుంది. ఈ జట్టులోని అజయ్‌కుమార్ 26 పరుగులు చేయడంతో పాటు 3 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతి పొందిన పడమటి ఫ్రెండ్స్ జట్టుకు జ్ఞాపికతో పాటు రూ.15,116 నగదును నిర్వాహకులు అందజేశారు. తృతీయ బహుమతి పొందిన అంబేద్కర్ యూత్ పోతుకట్ల జట్టుకు జ్ఞాపికతో పాటు రూ.10,116 నగదు బహుమతిని అందజేశారు. ఈ క్రికెట్ పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా నరేష్, బెస్ట్‌బౌలర్‌గా నారిశెట్టి అశోక్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లుగా రామకోటి, మురళీలకు జ్ఞాపికలతో పాటు నగదును అందజేశారు. బహుమతి ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ, జిల్లా టిడిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు భానుప్రసాద్, దివీస్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ శేఖర్‌బాబు, మండల టిడిపి అధ్యక్షుడు ఎం శేఖర్‌బాబు, నిర్వాహకులు పడమటి ఫ్రెండ్స్, గ్రామస్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అన్నగారి చలివేంద్రం ప్రారంభం
పంగులూరు, ఏప్రిల్ 17: మండలంలోని జాగర్లమూడివారిపాలెంలో అన్నగారి చలివేంద్రాన్ని అద్దంకి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎ శ్రీలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల, ప్రయాణీకుల దాహార్తిని తీర్చడం ఎంతో అవసరమన్నారు. ఈ చలివేంద్రాన్ని మాజీ సర్పంచి జె రామారావు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.