ప్రకాశం

విత్తనాల కోసం వెళ్లి విగతజీవుడయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, అక్టోబర్ 17: ఆరోగ్యం సరిగా లేదు అయినా అదునులో విత్తనం నాటకపోతే వెనుకబడిపోతాము, నష్టపడతాం, కమతము సాగదు దిగుబడిరాదు, ఇన్ని అనర్ధాలు ఎదుర్కొనేకంటే కొంచెం ఓపిక చేసుకని క్యూలో ఉంటే దక్కించుకోవచ్చే అనే ఆత్రం ఓ రైతు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తున్న విత్తనాల కోసం పరుగులు తీసిన ఓ రైతు విత్తనాలు అందుకోకపోగా తనువు చాలించాడు. ఈసంఘటన మండల కేంద్రమైన కురిచేడులో మంగళవారం జరిగింది. పొట్లపాడు గ్రామానికి చెందిన బాదం వెంకటేశ్వరరెడ్డి(64) గత కొద్ది రోజులుగా హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గుంటూరు జిల్లా వెనుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని మెట్టప్రాంత రైతులకు సబ్సిడీపై శనగలను పంపిణీ అందించాలని ప్రభుత్వ సంకల్పించింది. ఐతే గత ఏడాది కురిచేడు మండలంలో శనగల పంపిణీలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ విధానం ద్వారా నేరుగా పట్టాదారు పాసుపుస్తక యజమాని వేలుముద్ర తీసుకుని విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖాధికారి శ్రీకారం చుట్టాడు. వెంకటేశ్వరరెడ్డి పట్టాదారు పాసుపుస్తకం యజమాని కావడంతో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రినుంచి నేరుగా కురిచేడులోని వ్యవసాయశాఖ కార్యాలయానికి వచ్చిన అక్కడ వైద్యులు వలదని వారించినా వారి మాటలు బేఖాతరు చేసి విత్తనాల కోసం పరుగులు తీశాడు. క్యూలో వేచిఉన్న వెంకటేశ్వరరెడ్డి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించేందకు వ్యవసాయశాఖ సిబ్బంది తోటి రైతులు ప్రయత్నించినా అప్పటికే ఆయన కన్నుమూశారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు చివరి క్షణాల్లోకూడా వ్యవసాయంపై చూపించిన మక్కువకు ఔరా అని సాటిరైతులు ముక్కున వేలేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన పొట్లపాడు తరలించారు.