ప్రకాశం

వైకాపాను వీడే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి,అక్టోబర్ 21: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని వీడేది లేదని, తెలుగుదేశంపార్టీలో చేరేది లేదని మాజీ శాసనసభ్యుడు, వైకాపా దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదురెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా కొన్నిపత్రికల్లో, సామాజిక మాద్యమాల్లో తమ కుటుంబం తెలుగుదేశంపార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇది కొంతమంది కావాలనే తమకుటుంబంపై చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఆ మహానీయుడిపై ఉన్న అభిమానంతోనే గతంలో శాసనసభ సభ్వత్వానికి కూడా రాజీనామా చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచామన్నారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వలన వైకాపా అధికారంలోకి రాకపోయినా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తమకుటుంబం పరితపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజలకు విశ్వాసం లేదని రాష్ట్రప్రజలందరు రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఎంపి వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తమవంతు శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. గతంలో దర్శినియోజకవర్గాన్ని వదిలి ఇతర నియోజకవర్గంలో పోటీచేయాలని వత్తిళ్లు వచ్చిన మాట వాస్తవమేనని కాని తమ రాజకీయం దర్శి పట్టణంనుండి ప్రారంభమైందని, దర్శి నియోజకవర్గాన్ని వదులుకునే ప్రశక్తేలేదని స్పష్టం చేశారు. దర్శి నియోజకవర్గ కార్యకర్తల కోసం తమకుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలున్నప్పటికి వాటిని సరిదిద్దుకుని జిల్లా అధ్యక్షుడు బాలినేని, వైవిల ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి దర్శి నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైసిపి మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి ,సుదిదేవర అంజయ్య, జడ్‌పిటిసి మారం వెంకారెడ్డి, తాళ్లూరు ఎంపిపి మోషే, జిల్లాపార్టీ ప్రధానకార్యదర్శి కుమ్మితి అంజిరెడ్డి, డివిజన్ కన్వీనర్ విసి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.