ప్రకాశం

నెత్తురోడిన రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, అక్టోబర్ 21: జాతీయ రహదారి అనకుంట సమీపంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం ఉదయం పట్టణానికి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు గురిజేపల్లి నుంచి యర్రగొండపాలెం వస్తున్న ఆటోను అతివేగంతో వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో మూడు పల్టీలుకొట్టి ప్రయాణికులకు కాళ్ళు, చేతులు విరిగి సంఘటన స్థలం రక్తసిక్తంగా మారింది. బోయలపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి వీరమ్మ (75) తలకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్నబోయలపల్లి కాలనీకి చెందిన పెండ్యాల కోటయ్య (45) మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించి వైద్యం చేస్తుండగా మరణించాడు. బోయలపల్లి గ్రామానికి చెందిన యలమద్దరి నాగరాజుకు రెండుకాళ్ళు నుజ్జునుజ్జు కాగా గురిజేపల్లి గ్రామానికి చెందిన గద్ద దానంకు కుడికాలు విరిగింది. తమ్మడపల్లి గ్రామానికి చెందిన నారాయణకు ఎడమపాదం పూర్తిగా తెగిపోవడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సచేసి నరసరావుపేటకు తరలించారు. గంగుపల్లి గ్రామానికి చెందిన కేశనపల్లి కాశమ్మ, కేశనపల్లి అల్లూరమ్మ, కె వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బోయలపల్లి గ్రామానికి చెందిన వెన్నా పెద్దవీరారెడ్డికి రెండు పాదాలు చిట్లిపోయి తీవ్రగాయాలయ్యాయి. పట్టణానికి సమీపంలో మలుపువద్ద ఈ ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను 108 సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మాతంగి శ్రీనివాసరావు కాళ్లు విరిగిపోయి రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను పోలీసు వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరుకు వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మరో వ్యక్తి మరణించాడు.
భీతిల్లిన తల్లిదండ్రులు
శనివారం అనకుంట సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదం గురించి తెలుసుకున్న పట్టణానికి చెందిన కొందరు తల్లిదండ్రులు భీతిల్లిపోయారు. దీనికి కారణం ప్రతిరోజూ యర్రగొండపాలెం నుంచి పెద్దారవీడు మండలం రాజంపల్లిలో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి ఏడుగురు విద్యార్థులను ఆటోలో తీసుకువెళ్ళేవారని, శనివారం సెలవు కావడంతో ఆ ఆటోలో తమ పిల్లలు వెళ్ళకపోవడం మంచి జరిగిందని, ఇప్పటికైనా పెద్దారవీడు మండలం కేంద్రీయ విద్యాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దంపతులు దుర్మరణం
కందుకూరు : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలైన సంఘటన గుడ్లూరు మండల పరిధిలోని మనే్నరు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, డిఎస్పీ ప్రకాశరావు అందించిన సమాచారం మేరకు ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన నల్లగోగు రవి (42), అతని భార్య నారాయణమ్మ (30) వారి కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై గుడ్లూరు మండలం జానకంపేటలో బంధువుల ఇంటికి వెళ్తుండగా గుడ్లూరు మండలం మనే్నరు వద్ద ఎదురుగా కనిగిరికి చెందిన డిసిఎం వ్యాన్ గుడ్లూరు నుండి మాచవరం వస్తుండగా, అదే సమయంలో మాచవరం నుండి గుడ్లూరు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొన్నాయి. అయతే బైక్ వస్తున్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ఎలా మరణించారో తెలియలేదు. వారి మధ్యలో కూర్చున్న కుమార్తె రత్నకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న డిఎస్పీ కె ప్రకాశరావు, సిఐ కె నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏ వాహనం తగలడం వల్ల దంపతులు చనిపోయారో ఎవ్వరూ చూడలేదని, డ్రైవర్లను విచారించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.