ప్రకాశం

ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్‌లో అరుదైన ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 21: ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్ వైద్య బృందం అభిషేక్ అనే ఏడేళ్ల బాలుడికి చేసిన అరుదైన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. శనివారం స్థానిక సంఘమిత్ర హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సంఘమిత్ర హాస్పిటల్‌లో ఊపరితిత్తుల వైద్యనిపుణులు డాక్టర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని హనుమంతునిపాడు మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు అభిషేక్ అనే బాలుడు ఒక ప్లాస్టిక్‌పూసను మింగి ఆరోగ్యం సరిగాలేకపోవటంతో ఈనెల 18వతేదీ రాత్రి ఒంగోలులోని దక్షిణబైపాస్‌రోడ్డుగల సంఘమిత్ర ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చినట్లు చెప్పారు. అయితే తమ ఆసుపత్రికి బాలుడు వచ్చిన సమయంలో ఆయాసంగా ఉంటూ దగ్గుతూ ఊపిరిపీల్చటం బాగా ఇబ్బంది పడుతూ కనిపించారని తెలిపారు. ఎక్స్‌రేలో అభిషేక్ ఊపిరితిత్తుల్లో ఒక ప్లాస్టిక్ పూస ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో బాలుడు తెలియకుండా ఒక పూసను మింగటంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరిందని నిర్ధారించుకుని అభిషేక్ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించి త్వరితగతిన ఆపరేషన్ చేయకపోతే బాలుడు ఊపిరిపీల్చుకోవటం కూడా కష్టంగా మారి ప్రాణాపాయ స్థితిలోకివెళ్ళే ప్రమాదం ఉందని దీంతో ఈవిషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు తెలియచేసి వెంటనే ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దీంతో తనతోపాటు ఆసుపత్రికి చెందిన ఇఎన్‌టి వైద్యులు డాక్టర్ హరీష్‌రావు, మత్తు డాక్టర్ వంశీతోపాటు ఆసుపత్రికి చెందిన మరికొంతమంది వైద్యబృందం కలిసి బాలుడికి ఊపిరితిత్తుల్లో ఉన్న పూసను ఆపరేషన్ చేసి తీసినట్లు చెప్పారు. బాలుడు యధావిధిగా ఇబ్బందిలేకుండా శ్వాసను పీల్చుకోవటంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటన గతంలో జిల్లాలో ఎప్పుడు జరగలేదని తెలిపారు. ఈ ఆపరేషన్ కూడా జిల్లాలో గతంలో ఏ ఆసుపత్రిలో కూడా చేయలేదని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చెన్నై లేదా హైదరాబాదులాంటి ఆసుపత్రులకు వెళ్లటం ద్వారా అక్కడ మాత్రమే ఈ అరుదైన ఆపరేషన్ చేసే వైద్యబృందం ఉంటుందని అయితే తమ సంఘమిత్ర ఆసుపత్రి ఎండి దుంపా తిరుమలరెడ్డి సూచనమేరకు కష్టమైన ఆపరేషన్‌ను చేసి విజయవంతం చేశామని ఆయన తెలిపారు.మత్తుడాక్టర్ వంశీ మాట్లాడుతూ అభిషేక్ అనే బాలుడికి ఎంతో జాగ్రత్తగా వైద్యబృందం ఆపరేషన్ చేసిప్లాస్టిక్ పూసను బయటకు తీసినట్లు చెప్పారు. ఇఎన్‌టి డాక్టర్ హరీష్‌రావు మాట్లాడుతూ అభిషేక్ మింగిన ప్లాస్టిక్‌పూస ఊపిరితిత్తుల్లోకి పోవటంతో ఆపరేషన్ చాలా కష్టమైనప్పటికి ఇంటిన్స్‌వ్ కేర్‌లో పెట్టి15నుండి 20నిమిషాల్లోనే ఆపరేషన్ చేసి పూసను బయటకు తీశామన్నారు. అభిషేక్ తండ్రి శేఖర్ మాట్లాడుతూ తాము పేదవారమని మద్రాసులాంటి ఆసుపత్రులకు వెళ్తేతాము వైద్యఖర్చులు భరించే శక్తిలేదన్నారు. ఇలాంటి పరిస్ధితిలో సంఘమిత్ర వైద్యులు తమ కుమారుడు అభిషేక్‌మింగిన ఒకపూసను బయటకు తీసి తమ బిడ్డకు ప్రాణాలు వైద్యులు పోశారని వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.